విజయవాడలో వైసిపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం

23 May 2016


ఎపిలో ప్రదాన ప్రతిపక్షమైన వైఎస్ ఆర్ కాంగ్రెస్ కూడా ఇక విజయవాడలోనే ప్రదాన సమావేవాలు నిర్వహించడానికి సిద్దమవుతోంది. ఎపి తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఆ ప్రక్రియలో ఉన్న సంగతి తెలిసిందే. వైఎస్ ఆర్ కాంగ్రెస్ తన కార్యక్రమాలను హైదరాబాద్ లోటస్ పాండ్ నుంచి నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. జూన్ ఆరున వైసిపి రాష్ట్ర కార్యవర్గ సమావేశం విజయవాడలో జరపాలని నిర్ణయించారని సమాచారం. ప్రాదమికంగా ఈ నిర్ణయం తీసుకున్నా, జూన్ పదకుండున రాజ్యసభ ఎన్నిక పోలింగ్ ఉన్నందున , ఆ తర్వాత ఈ సమావేశం పెట్టాలా? లేక ఆరునే జరపాలా అన్నదానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు.రాజ్యసభ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిపోతే ఇబ్బంది ఉండదు. లేకుంటే ఏదైనా పోటీ ఉంటే అప్పుడు పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు.

Till now AP opponent party YSRCP is conducting meetings in Lotus pound in Hyderabad. Now YSRCP decided to conduct meeting in Vijayawada.