సాక్షి పత్రిక పై నోరు పారేసుకున్నా చంద్రబాబు…

19 May 2016ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత, చంద్రబాబునాయుడు నోట మరోసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబ ఆధ్వర్యంలోని ‘సాక్షి’ దినపత్రిక ప్రస్తావన వినిపించింది. గతంలో పలుమార్లు ఆ పత్రిక పేరు బహిరంగ వేదికలపై ప్రస్తావించిన చంద్రబాబు… అవినీతి సొమ్ముతో ఏర్పాటైన ఆ పత్రికను స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు.

బుధవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటన సందర్భంగా పెద్దాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదికపై చంద్రబాబు మరోమారు ‘సాక్షి’ ప్రస్తావన తెచ్చారు. ప్రత్యేక హోదా విషయంలో కొందరు పనిగట్టుకుని ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి సొమ్ముతో ఏర్పాటైన జగన్ పత్రిక కూడా ప్రభుత్వంపై విమర్శలకే ప్రాధాన్యమిస్తోందని ఆయన మండిపడ్డారు. అవినీతి ఆస్తులు స్వాధీనం చేసుకున్నప్పుడు, అవినీతి సొమ్ముతో ప్రారంభమైన జగన్ పత్రిక కూడా ప్రభుత్వపరమవుతుందని చంద్రబాబు చెప్పారు.

అయితే వాస్తవానికి చంద్రబాబు మాట్లాడిన తీరు అందరిని కూడా ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే అధికారం లో ఉన్న వ్యక్తి , ఇంకా జగన్ కేసు విషయం లో తుది నిర్ణయం రాకముందే అది అవీనీతి చెప్పడం నిజంగా కూడా ప్రజాస్వామ్యం అని అన్పించుకోవు.  కానీ ప్రజలు మాత్రం చంద్రబాబు అవీనితీ బయటపడకుపండా ఉండటానికే ఇలా ఈ పత్రిక మూసి వేయాలి అని కోరుకుంటున్నాడు అని అనుకుంటున్నారు.

Chandrababu Naidu again slipped on Sakshi news paper. In east godhavari meeting he was commented on Sakshi news paper.