పాలేరులో టిడిపికి సంతృప్తిగా ఉందట

3 May 2016


పచ్చతోక మీడియాకి కనీసం ఏదెలా రాయాలన్న ఇంగితం కూడా నశించిందనిపిస్తుంది. పార్టీ పాలేరు బై ఎలక్షన్ బరిలో లేనప్పుడు విమర్శలు  ఎదుర్కొంటోంది. దాన్ని సమర్ధవంతంగా తిప్పికొట్టడం మాని, తామేదో చేసామని, దానికి టిఆర్ఎస్ భయపడిందంటూ జబ్బలు చరుచుకుంటున్నారట. ఇది వాళ్ల పత్రికలో వచ్చిందే, దాని ప్రకారం టిడిపివాళ్లు ముందు పోటీలో నామా నాగేస్పర్రావ్ ని దింపుదామనుకున్నారట.
ఎప్పుడైతే నామాని దింపుతున్నట్లు తెలిసిందో అప్పుడిక టిఆర్ఎస్ కి ఉచ్చ పడిందట. రెండ్రోజులు మంత్రి తుమ్మలకి నిద్రే పట్లేదట. ఇదీ ఆ రాతగాడి పైత్యం, ఆ తర్వాత బరిలో లేకుండాపోయేసరికి టిఆర్ఎస్ ఊపిరి పీల్చుకుందట.

ఏదైనా రాస్తే అర్ధం ఉండాలి, చదివినోడికి కనీసం ఏదోక ఏంగిల్ లో నిజమనిపించాలి. అదేదీ లేకుండా, అసలు టిఆర్ఎస్ ఈ సీటు ఓడిపోయినా కొత్తగా ఊడేదేం లేదు, వచ్చేది సీటే, ఎమ్మెల్సీగా ఎటూ తుమ్మల కంటిన్యూ అవుతాడు. అంత మాత్రాన అక్కడికేదో నిజంగానే టిఆర్ఎస్ ని ఓడించినంత ఊపు వచ్చినట్లు బిల్డప్ ఇస్తోందా పత్రిక. ఆ రెండ్రోజుల తర్వాత ఏదైతేనేం బరిలో లేకపోయినా మమ్మల్ని చూసి టిఆర్ఎస్ రెండ్రోజులు దడుచుకుంది అంతే చాలని సంతృప్తి పడుతున్నారట తెలుగు తమ్ముళ్లు ఖమ్మంలో. ఇంతకన్నా అవమానకర రాతలు ఇంకోటి ఉండవ్ తెలుగు తమ్ముళ్లకి. అంటే ఇక ఏ ఎన్నికకైనా ఇంతే అభ్యర్ధిని ప్రకటించి సంతృప్తి పడతారేమో చూడాలి.

Recently By elections are conducted in Paderu. In that elections TDP won a seat. So Yellow media wrote about it very highly.