పొంగులేటి అందుకే మారుతున్నాడా..?

5 May 2016


తెలంగాణ పార్టీలోకి ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ నేతలే జంప్ అయ్యారు. ప్రస్తుతం వైకాపా టర్న్ వచ్చింది. టీఆర్ఎస్‌లోకి వైకాపా తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా చేరిపోవడం ఖాయమైన నేపథ్యంలో, పొంగులేటి చేరిక, టీఆర్ఎస్ లో వైసీపీ  తెలంగాణ శాఖ  విలీనంపై  టీటీడీఎల్పీ నేత రేవంత్ మండిపడ్డారు. పొంగులేటి టీఆర్ఎస్‌లోకి చేరనున్నట్లు స్వయంగా ప్రకటించిన నేపథ్యంలో, పొంగులేటికి రూ.1,500 కోట్లు ఎరవేస్తే పార్టీ మారడం ఏమిటి..? వైకాపానే తెరాసలోకి విలీనం చేయరా ఏంటంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించడంపై అనుమానాలు రేగుతున్నాయ్. నిజంగా కేసీఆరే పొంగులేటికి బంపర్ ఆఫర్ ఇచ్చి పార్టీలోకి తీసుకున్నారేమో అని అనుమానాలు వస్తున్నాయ్. ఆంధ్రప్రదేశ్‌‍లో తన పార్టీ ఎమ్మెల్యేలను టీడీపీ కొనుగోలు చేస్తుందని తీవ్ర విమర్శలు గుప్పించిన వైఎస్సార్సీపీ అధినేత  జగన్మోహన్ రెడ్డి తెలంగాణలో తన పార్టీ నేతల ఫిరాయింపులపై ఎందుకు నోరెత్తలేదని అడిగారు. 

In Telangana State YSRCP MP Poguleti Srinivasarao is jumping into TRS. For this TDP leader Revanth Reddy commented KCR gave 1,500 crores for Poguleti to attract to his party.