సమంత బాయ్ ఫ్రెండ్ ఎవరు..?

28 May 2016సిధ్దార్ధతో కాళహస్తి నాగసర్పదోష మంటపంలో పూజలు కూడా చేసి, ఆ తర్వాత  బ్రేకప్ చెప్పిన సమంత ఇప్పుడు పెళ్లికి రెడీ అంటోంది. ఓ హైదరాబాదీ తో తన ప్రేమ కొనసాగుతుందని, చాలా రోజులనుంచి అతను పరిచయమని, తనలానే సోషల్ సర్వీస్ కూడా  చేస్తాడని అందరికీ చెప్పేసింది సమంతా రూత్ ప్రభు. ఐతే ఆ రోజునుంచి జనంలో చాలా లెక్కలు ప్రారంభమయ్యాయ్ ప్రిన్స్ మహేష్ నుంచి, నితిన్ వరకూ అందరినీ తమ అల్లికల్లోకి తెచ్చేశారు ఫ్యాన్స్. యంగ్ హీరో అంటున్నారు కాబట్టి నితిన్, రానా, నాగచైతన్య, బెల్లంకొండ శ్రీనివాస్ ను ఊహించుకున్నారు. 

చాలా రోజులనుంచి పరిచయం అంటే నాగచైతన్య అనుకున్నారు, ఇక సోషల్ సర్వీస్ అనే మాట వచ్చేసరికి ఇక్కడ రానా తప్ప మిగిలిన వాళ్లెవరూ సదరు కార్యక్రమాలు వెలగబెట్టింది లేదు. కానీ ఇక్కడ పైన చెప్పిన హీరోల్లో మహేష్ బాబు ఒక్కడే సమంతకి చాలా రోజులనుంచి పరిచయం ఉన్నది. అలానే సోషల్ సర్వీస్ చేస్తున్న మనిషి, ఐతే బ్యాచిలర్ కాదు, అలాని సమంత బ్యాచ్ లర్ అని చెప్పలేదు. ఐతే వాళ్ల ఫ్యామిలీలో కూడా తమ ప్రేమకి ఓకే చెప్పారనడమే ప్రిన్స్ ని కొట్టేయించింది. పైగా మహేష్ బాబు కి నమ్రతతోపెళ్లై ఇద్దరు బిడ్డల ముద్దుల తండ్రి కాబట్టి మహేష్ కాదు. ఇదిగో ఇలా సమంతని పెళ్లాడే యూత్ హీరో ఎవరనే విషయంపై తెగ చర్చలు సాగుతున్నాయ్. అలానే ఎందుకనుకోవాలి, సిధ్దార్ధతో చాలా పరిచయం ఉంది, సోషల్ సర్వీస్ చేస్తాడు, వంటా చేస్తాడు కాబట్టి తిరిగి అతనితో ప్యాచ్ అప్ అయిందని ఎందుకు అనుకోకూడదని  అనేవాళ్లూ ఉన్నారు, సో వెయిట్ అండ్ సీ.

Samantha was breakup with her exboy friend Sidhartha. Now she is busy with her movies. Recently she announced i am going to marry with an Hyderabad boy. It gives tension to all her fans.