మళ్లీ రంగు పూసుకుంటాడట

24 May 2016


ఎన్నికల్లో చావుదెబ్బ తిన్న విజయ్ కాంత్ తిరిగి మొహానికి రంగు పూసుకుంటున్నాడు. దాదాపు పదిహేనేళ్లు రాజకీయాల్లో ఏకవ్యక్తి సైన్యంగా నడిచిన కెప్టెన్ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరపరాజయం చవిచూశాడు. దీంతో ఆయన అభిమానుల్లో కొంతమంది డీప్ షాక్ లోకి పోయారు. ఒకరు సూసైడ్ చేసుకున్నారు కూడా, ఐతే విజయ్ కాంత్ మాత్రం అవేవీ పట్టించుకోకుండా మళ్లీ తెరపైకి అంటూ రీ ఎంట్రీ  ఇస్తున్నాడు.

తెలుగువాళ్లకి తమిళుడుగా పరిచయమైనా, చిత్తూరు జిల్లా నాయుడైన విజయ్ కాంత్ నాగలిపట్టిన నాయకుడు సింధూరపువ్వు, పోలీస్ అధికారి, కెప్టెన్ ప్రభాకర్, సిటీ పోలీస్, అడవిపులి, రౌడీ నాయకుడు, కమిషనర్ రుద్రమనాయుడు, శాల్యూట్, ఠాగూర్ ఇలా ప్రతి సినిమా తెలుగులోకి డబ్బైంది. అతనికి మంచి ఫాలోయింగ్ వచ్చింది. ఓ రకంగా డబ్బింగ్ ఇండస్ట్రీకి సాయికుమార్ వాయిస్ ని బాగా పరిచయం చేసింది మనోడే పరోక్షంగా కారణమని చెప్పాలి. 

అలాంటి విజయ్ కాంత్ 2006 లో పొలిటికల్ ఎంట్రీ  ఇచ్చి ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్నా, 2011 నాటికి 29మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న ఘనుడు. ఐతే ఇక సిఎం కరుణానిధి, లేదంటే జయలలిత అనే స్థాయినుంచి ఓ దశలో తమిళులకు ఆల్టర్నేటివ్ గా మారేది విజయ్ కాంతే అన్పించింది కూడా. ఐతే జయలలిత ప్రభంజనం ముందు కెప్టెన్ గడ్డిపరకలా తేలిపోవడంతో, ప్రస్తుతం మళ్లీ కొడుకు షణ్ముగపాండియన్ తో కలిసి సినిమా చేస్కుంటున్నాడు.

Kollywood hero Vijaykanth got big disaster in recently elections results. He entered into politics in 2006. Now again he is getting ready to do movies.