జలీల్ ఖాన్ తమ్ముడికి టోపీ పెట్టాడా?

18 May 2016


జంపింగ్ జపాంగ్ గా పేరు  తెచ్చుకున్న జలీల్ ఖాన్ విజయవాడలో దందాలు చేయడంలో దిట్ట. ఇది ఆయనగారి మిత్రపక్షమైన బిజెపినే చెప్తోంది. అసలు పార్టీ మారింది కూడా పవర్ గల పార్టీలో ఉంటే, తన జులుం ఇంకా యధేచ్చగా ప్రదర్శించడానికే అని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ మధ్యే కుండబద్దలు కొట్టారు. అంతేకాకుండా జలీల్ ఖాన్ సొంతవారికీ టోపీ పెట్టేస్తాడట, వక్ఫ్ బోర్డ్ ఆస్తులు ఇతరులు కాజేస్తే ఎగిరెగిరి పడే నేతలు, అదే వర్గానికి చెందిన జలీల్ ఖాన్ విజయవాడలోని తారాపేటలోని ఓ కాంప్లెక్స్ ని కొట్టేశాట్ట. బెదిరించో, భయపెట్టో అది చవకగా కొట్టేసి తమ్ముడి పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాట్ట. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది, తమ్ముడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించేసి ఆ తర్వాత కరీంకాంప్లెక్స్ ను ఇంకొకళ్లకు అమ్మేసాడట జలీల్ ఖాన్. 

ఇదే అంశం వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పారు. తన పేరుతో కొనేసరికి, ఆనందం పట్టినంత సేపు మిగల్లేదట జలీల్ సోదరుడికి యాబై కోట్ల రూపాయలు లాభం పొందినా తమ్ముడికి మాత్రం పైసా కూడా ఇవ్వలేదట. ఇదే జలీల్ అసలు గలీజ్ యవ్వారాలకు నిదర్శనమని వెల్లంపలి ఫైరయ్యారు. మిత్రపక్షమైనా కూడా బిజెపి ఇలా జలీల్ ఫై ఫైరవడానికి కారణం, బిజెపికి అంత సీన్ లేదని జలీల్ ఈ మధ్యకాలంలో ఎగతాళి చేయడమే కారణం. దీంతో చిర్రెత్తుకొచ్చిన బిజెపి నేతలు టిడిపి ఏమనుకున్నాసరే, జలీల్ కి వార్నింగివ్వాలనే డిసైడయ్యారు.

Vijayawada MLA Jaleel Khan recently jumped into TDP. Present he is hot topic in Vijayawad. He cheated his brother. So Vijayawada BJP leaders are also firing about Jaleel Khan.