విజయసాయే ఎందుకు?

27 May 2016


ఏపీలో ఒకే ఒక్క రాజ్య‌స‌భ టిక్కెట్ అవ‌కాశం ఉన్న వైసీపీ త‌న అభ్య‌ర్థిగా విజ‌య సాయిరెడ్డిని ఎంపిక చేసింది. వైసీపీకి వెన్నెముక‌గా ఉంటూ, పార్టీ బాధ్య‌త‌లు మోస్తున్న విజ‌య‌సాయిరెడ్డిని రాజ్య‌స‌భ‌కు పంపాల‌ని పార్టీ అధినేత జ‌గ‌న్ నిర్ణ‌యించారు. మొద‌టి నుంచి జ‌గ‌న్ వ్యాపార సామ్రాజ్యానికి సంబంధించిన లెక్క‌లు, ప‌త్రాల‌ను మెయింటైన్ చేసిన విజ‌య‌సాయిపై జ‌గ‌న్ మోహన్ రెడ్డికి బాగా భ‌రోసా ఉంది. అలాంటి విజయసాయి రాజ్యసభలో ఎంపిగా ఉంటే పార్టీ స్టాండ్ ని బాగా విన్పిస్తారనే జగన్ సాయిని ఎంపిక చేశారంటారు. ఐతే విజయసాయి ఎంపికను పార్టీలో కొంతమంది తప్పుబడుతున్నా. లాంగ్ రన్ లో తన నిర్ణయం కరెక్టని అంగీకరిస్తారని జగన్ నమ్మకం.

గతంలో పార్టీలో నలుగురైదుగురు యాక్టివ్ గా పని చేస్తున్నట్లు కన్పించేది..ఇప్పుడు విజయసాయి రెడ్డి తో పాటు..వారు కూడా పార్టీలో బాధ్యతలు పంచుకుంటారని జగన్ స్పష్టం చేసినట్లు టాక్. ఏదెలా ఉన్నా సిబిఐ అధికారులే స్వయంగా విజయసాయి జీనియస్ గా వర్ణించినప్పుడు జగన్ ఆయన్ని రాజ్యసభకి పంపించడంలో తప్పు లేదంటారు. ఆడిటింగ్ స్కిల్స్ ఉన్న విజ‌య‌సాయికి రాజ్య‌స‌భ సీటు తోడైతే, ఇక ఎదురుండ‌ద‌ని వైసీపీ భావిస్తోంది. కానీ, ఆయ‌నను ఓడించేందుకు టీడీపీ ఇప్ప‌టికే పావులు క‌దుపుతోంది. మ‌రో 20 మంది ఎమ్మెల్యేలు టీడీపీ వైపు వ‌చ్చేస్తే, విజ‌య‌సాయి అప‌జ‌యం ఖాయ‌మ‌ని టీడీపీ నేత‌లంటున్నారు. ఐతే అదంత తేలిక కాదని విజయసాయి చాణక్యం ముందు అలాంటి జిత్తులు పని చేయవని అంటున్నారు.

YSRCP Leader YS Jagan decided Vijaya Sai Reddy as Rajyasabha memeber. Some of the leaders are opposing this decisions. But this is good decision Vijayasai Reddy is good at auditing, so he will lead Rajyasabha very well.