ఆ నేరం నాది కాదంటున్న వెంకయ్య

28 May 2016


ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేకం అంటాం, అవన్నీ పట్టించుకుంటే ఎలా అన్నట్లుగా సాగుతుంది కేంద్రమంత్రి వెంకయ్య తీరు. ఏపీకి ప్రత్యేక హోదా వచ్చే ప్రసక్తే లేదని కుండబద్దలు కొట్టేసిన వెంకయ్యనాయుడు తీరుపై ఏపీలో తెలుగుబిడ్డలు మండిపడుతున్నారు. దాన్ని కవర్ చేసేలా ఏబీఎన్ కూడా నానాతంటాలు పడుతోంది. ఐతే విషయం తెలీని జనం ఎవరూ లేరు. రాజ్యసభలో రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే స్పందించానని, బిల్ లో ప్రత్యేక హోదా ని చేర్చాలని చెప్పినా, ఎవరూ పట్టించుకోలేదని, అలా అడగడమే నా నేరమా అంటూ నంగనాచి అమాయకత్వం నటిస్తున్నారు వెంకయ్యనాయుడు. సరే అంతవరకూ బాగానే ఉంది. మరి ఎన్నికల ప్రచారంలో కూడా  అదే పాట ఎందుకు పాడారు, వెంకయ్యా సమాధానం చెప్పు..? పోనీ నీకు చేతకాదని చెప్పకుండా మొదటి ఏడాదిన్నర ఎందుకు కవర్ చేస్కున్నావ్, మా పరిశీలనలో ఉందంటూ ఎందుకు నాన్చావ్, యువకులు ఆత్మహత్య చేసుకునేలా మాటలు ఎఁదుకు మార్చావ్.

హోదా ఇస్తే సరిపోతుందా అంటూ బిల్డప్ ఇచ్చే వెంకయ్యనాయుడు కేంద్రమంత్రి పదవిలో కూర్చున్న వారిలా మాట్లాడకుండా, దారిన  పోయే దానయ్యలా నేను దిగిపోతే సరిపోద్దా అనడం సబబా..? గతంలో కాంగ్రెస్ మంత్రులు కూడా ఇలానే స్పందించేవాళ్లు నే రాజీనామా చేస్తే, తెలంగాణా వస్తుందా అఁటూ, సరిగ్గా అదే సీన్ ఇప్పుడు రిపీటవుతున్నట్లుంది. అలానే అమరావతిపై ప్రచారం జరుగుతున్నది నమ్మవద్దని బిల్డప్ ఇచ్చాడీయన. అసలు హాదాకి మించిన సాయం ఆల్రెడీ చేశామన్నాడు, మరి బిల్ లో ఉన్న పోలవరం, ప్రత్యేక రైల్వే జోన్ ఎందుకు ఇవ్వడం లేదో చెప్పడు, బహుశా అది రైల్వేశాఖ పరిధిలోని దంటాడేమో. ఇలా మాటలు మార్చే మోసగాడిని మాటల మాంత్రికుడని పొగడటం ఇకపైనైనా మానాలి.

Central minister Venkayya Naidu is now changing his talks. Till now he told, we will get special status for AP. But now he is telling it is not possible to get special status to AP.