ఇంట్లో ఈగల మోత..బయట పల్లకీల మోత

28 May 2016


వెంకయ్యనాయుడు సిచ్యుయేషన్ చూస్తే ఇలానే  ఉంది. డైరక్ట్ ఎలక్షన్స్ లో పెద్దగా రాణించని ఈయన ఇప్పుడు కేంద్రంలో పవర్ ఫుల్ మినిస్టర్, అసలు ఏపీకి ఏదైనా దక్కిందంటే అది ఈయనవల్లనే అని మోడీ కూడా పొగిడేస్తుంటారు. అలాంటి వెంకయ్యనాయుడు పాపం రాజ్యసభకి తిరిగి  ఎంపికవ్వాలంటే సొంత రాష్ట్రం నుంచి మాత్రం కుదరడం లేదు. నాలుగోసారి ఎఁపికవ్వాలంటే తిరిగి కర్నాటకపైనే ఆధారపడాల్సి వచ్చింది. ప్రజలచేత ఎన్నుకోబడని నేత అంటూ మాజీ ప్రధాని మన్మోహన్ పై సెటైర్లు వేయడంలో అగ్రగణ్యుడైన వెంకయ్య తాను మాత్రం అలా  ఎన్నిక కావడాన్ని గొప్పగా సమర్ధించుకుంటారు, అలాంటి నేత పాపం సొంత రాష్ట్రంలో దిక్కులేకపోవడమే కామెడీ.

ఏపీలో మిత్రపక్షం అధికారంలో ఉన్నా, నలుగురే బిజెపి ఎమ్మెల్యేలున్నారు. నిజానికి వైఎస్సార్సీపీ నేతలతో కూడా ఈయనికి మంచి సంబంధాలే ఉన్నాయ్, ఐనా టిడిపి వెంకయ్యని తమ కోటాలో  పంపాలనుకోలేదు, దీంతో వేరే దిక్కులేక చివరికి మళ్లీ కర్నాటక నుంచే రాజ్యసభకి వెళ్లాల్సి వస్తుంది వెంకయ్యనాయుడికి. ఐతే కర్నాటక నేతలు కూడా ఈ డెసిషన్ పై లోలోపల పళ్లు కొరుక్కుంటున్నారట. రాష్ట్రానికి ఒరగబెట్టిందేం లేకుండా మళ్లీ ఇలా తమపై ఎందుకు రుద్దుతున్నారని పీలౌతున్నారట.

Central minister Venkayya Naidu was elected form Karnataka to Rajyasabha. Now again he is elected to Rajyasabha from Karnataka. It gives angry to Karnataka people.