బంగార్రాజుగా ఉప్పి

27 May 2016


తెలుగులో నాగార్జునకి ఊపిరిలూదిన సినిమా సోగ్గాడే చిన్ని నాయనా. మరీ అంత యూత్ ఫుల్ గా కాకపోయినా, తనలో సోలో హిట్లిచ్చే దమ్ముందని నాగ్ రుజువు చేసిన సినిమా ఇది. ఇప్పుడీ సినిమానే కన్నడంలోరీమేక్ అవుతుంది. ఇందులో హీరోగా ఉపేంద్ర నటించబోతున్నాడట. ఉపేంద్రకి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. డిఫరెంట్ గా నటించడం, డిఫరెంట్ మాడ్యులేషన్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉపేంద్ర యంగ్ హీరోల ధాటికి వెనకబడ్డాడిప్పుడు. హిట్లకోసం తపన పడుతూ సీక్వెల్స్ కూడా తీసుకుంటున్న ఉపేంద్ర ఇప్పుడు తెలుగు రీమేక్ లపై దృష్టి పెట్టాడు.

అందులో తన ఏజ్ గ్రూప్ కి తగ్గట్లుగా సినిమాలు తీసుకుంటే బెటర్ అని భావించి, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలు తీస్తున్న సినిమాలను రీమేక్ చేసి కన్నడిగులపైకి వదులుతున్నాడు. ఆ వరసలోనే సోగ్గాడే చిన్ని నాయనాని ఉపేంద్ర కన్నడంలోకి అనువదిస్తున్నాడు. ఇందులో రమ్యకృష్ణ క్యారెక్టర్లో ప్రేమ నటిస్తుందట. యంగ్ హీరో క్యారెక్టర్ కి ఇంకో టాప్ హీరోయిన్ ని సెలక్ట్ చేసే పనిలో పడ్డాడట ఉప్పి.

Tollywood latest biggest hit Sogade Chinni Nayan movie is remaking by Upedra in Malayam. Last few years he has no movies. So he is trying to dub hit movies.