అఖిల్ విషయంలో ఎందుకలా..?

2 May 2016


మొదటి సినిమా దారుణమైన ఫ్లాపైతే, రెండో సినిమాపై చాలా జాగ్రత్తగా ఉంటారు. అందులోనూ ఓ పేద్ద వంశం నుంచి వచ్చిన వారసులకి ఇది మరీ ఎక్కువగా ఉండకతప్పదు, మరి అఖిల్ విషయంలో ఎందుకు అలా జరుగుతుందో తెలీడం లేదు. అన్నీ ఉన్నా, మనోడిలోనో ప్రాబ్లెమ్ ఉఁదేమో అనుకోకతప్పదు. లైలా అనే పేరుతో వచ్చిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు. ఒక లైలా కోసం అంటూ ఇదే వంశంలో ఆదిపురుషుడు అక్కినేని నాగేశ్వర్రావ్ ఆడిపాడాడు. ఆ పాటలోని మొదటి పదంతో నాగచైతన్య ఓ సినిమా తీసినా పెద్దగా ఆడింది లేదు. లైలా మజ్ను మూవీ సంగతీ అంతే.

మరిప్పుడు అఖిల్ తన రెండో సినిమాకి లైలా ఓ లైలా అనే టైటిల్ పెట్టుకున్నట్లు టాక్. ఊపిరి ఇచ్చిన విజయంతో వంశీ పైడిపల్లికి దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పినట్లున్నాడు నాగ్. ఐతే మరి ఈ టైటిల్ ను ఎందుకు ఎంపిక చేసుకున్నారో మాత్రం తెలియడంలేదు. ఫస్ట్ ఫిల్మ్ కనీసం 20 కోట్లు కలెక్ట్ చేయకపోగా, ఇప్పుడు రెండో సినిమాని కేర్ తీసుకుని చేయాల్సి ఉండగా, ఆదరాబాదరాగా ఎందుకు చుట్టేయడానికి సిధ్దమవుతున్నారో తెలీదు. లైలా ఓ లైలా టైటిల్ మార్చాల్సిందేనంటూ ఫ్యాన్స్ కోరుతున్నారు. ఏ నెగటివ్ ఎలిమెంట్స్ లేకుండా, అన్నీ శుభ శకునాలే చూసుకునే ఇండస్ట్రీలో ఈ వాదన పట్టించుకోవాల్సిందే మరి.

Akkineni Nagarjuna is another movie in the direction of Vamsi Paidipalli. Title to this movie is Laila O Laila fixed. But title is sentiment for this movie.