మీకు ఫ్రీ..అన్నీ ఫ్రీ

7 May 2016

zy
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో అక్షరాలా హామీల వర్షమే కురుస్తోంది. మనిషికి అవసరమైన వస్తువులతో పాటు, తమ దృష్టికి ఏది వస్తే అది ఫ్రీగానో, ముఫ్పాతిక రేటు తగ్గించో ఇస్తామంటూ ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించడం విమర్శలపాలవుతోంది. గెలుపే లక్ష్యంగా జయ ప్రకటిస్తున్న వాగ్ధానాల పరంపరలో అరవతంబిలు తడిసి ముధ్దవుతున్నారు. ఫ్రీ ఫ్రీ ఫ్రీ ఏదైనా ఫ్రీ అనే రేంజ్ లో అరవనాడు సిఎం జయలలిత మేనిఫెస్టోలో ఎప్పటికప్పుడు వాగ్ధానాలను అప్ డేట్ చేస్తున్నారు. తన దృష్టికి వచ్చిన ఏ అంశాన్ని, వదలకుండా ఉచిత చట్రంలో బిగించేసి వరాలు కురిపిస్తున్నారు. మిగిలిన పార్టీలు, మద్యపాన నిషేధం, విద్యార్ధులకు లోన్లు, రైతులకు రుణమాఫీ అస్త్రాలను ప్రయోగిస్తే, తాను మాత్రం ఉచితాస్త్రాలను వాడుకుంటున్నట్లు కన్పిస్తోంది.

పెరుందురైలో జయలలిత రైతులకు అప్పుల బకాయిలను రద్దు చేయడంతో మొదలెట్టి తన వాగ్ధానాల పరంపర కొనసాగించారు. వంద యూనిట్లలోపు కరెంట్ ఫ్రీ, ల్యాప్ ట్యాప్ లకు ఇంటర్నెట్ ఫ్రీ, రేషన్ కార్డుంటే చాలు అందరికీ సెల్ ఫోన్లు ఇస్తామన్నారు. ఇక బైకులు, స్కూటీలను సగం రేట్లకే లేడీస్ కి ఇస్తామంటూ హామీ ఇచ్చారు. అలానే కూపన్లతో ఫ్రీగా బట్టలు, ఇళ్లలోన్ కోసం గవర్నమెంట్ ఉద్యోగులకు 40 లక్షల రూపాయల లోనిస్తామని చెప్పడం హైలెట్. ఇక మెటర్నరీ లీవ్ 9నెలలు ప్రకటించడం కరుణానిధి వాగ్ధానాన్ని రిపీట్ చేయడమే.

సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులతో సమానంగా రాష్ట్ర ఉద్యోగులకు జీతాలు పెంచుతామన్నారు జయలలిత. ఇలా జయలలిత వాగ్ధానాల సునామీతో సోనియా-కరుణానిధి సభకి ఉన్న ప్రాధాన్యతను కూడా చెరిపివేశారు. వ్యూహాత్మకంగా జయ ఇలా మేనిఫెస్టో విడుదల చేయవచ్చు కానీ, ఇలా ఎడా పెడా ఉచిత హామీలు వాగ్ధానాలు ఇస్తూ పోతే రేపు రాష్ట్ర ఖజానాకి చిల్లు పడటం ఖాయమని రాష్ట్రంలో ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐతే విజయం టార్గెట్ గా దూసుకుపోతున్న అరవపార్టీలు ఈ హెచ్చరికలను పెడచెవిన పెడుతున్నాయ్.

Tamilnadu state is very hot elections campaign. All parties are companion with free offers to voters. Present CM Jayalalitha giving more offers to People.