రాజ్యసభకి టి.టిడిపినేతలకు ఇచ్చేదే లేదు

28 May 2016


రాజ్యసభ ఎంపిల ఎన్నిక నోటిఫికేషన్ రావడంతో టిడిపిలో కాక మొదలైంది. అన్ని పార్టీల్లో ఎవరెన్ని సీట్లు గెలుస్తారో ఓ క్లారిటీ ఉంది, ఐతే టిడిపి మాత్రం ముగ్గురితో సరిపెట్టుకోవాలా, లేక మరో కాండిడేట్ ని నిలబెట్టాలా అనే గందరగోళంలో ఉంది. ఎందుకంటే జంప్ జిలానీలను ప్రోత్సహిస్తే, ఇంకో ఎఁపి దక్కుతాడు గ్యారంటీ కానీ ఈ సందడిలో సుప్రీంకోర్టు ఏమైనా తీర్పిచ్చిందంటే అందరూ రాజీనామాలు చేయాల్సి ఉంటుంది. 

ఐతే తెలంగాణలోని లీడర్లు తమకి ఛాన్స్ ఇవ్వాలని అడుగుతుంటే చంద్రబాబు కి నారా లోకేష్ కి వళ్లు మండుకొస్తుందట. ఎందుకంటే వీళ్లని పొరపాటున గెలిపించామా, ఇక ఎప్పుడంటే  అప్పుడు గుండు సుధారాణిలా టిఆర్ఎస్ లోకి జంప్ కావడం ఖాయమని అంచనాలో ఉన్నారు. అంత కష్టపడి రిస్క్ చేస్తే, లాభం మాత్రం టిఆర్ఎస్ కి దక్కడంపై కడుపు రగిలిపోతుందని చంద్రబాబు అంతర్గత సంభాషణల్లో మండిపడుతున్నారట. ఐతే ఇది సహజమే అయినా, మరి ఇదే పని వైఎస్సార్సీపీ నేతలను లాక్కున్నప్పుడు ఏమైందంటారు అదెలా ఉన్నా, ఇప్పుడు రాజ్యసభకి నలుగురిని నిలబెట్టినా, ముగ్గురికే ఛాన్స్ అది కూడా తన ఆంతరంగికులకే కట్టబెట్టాలని లోకేష్ ప్లాన్.

ఇంకా అయితే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ప్రస్తుతానికి పార్టీలోకి ఆహ్వానించకుండా, సెకండ్ ప్రయార్టీ ఓటింగ్ లో తమ నాలుగో కాండిడేట్ని గెలిపించుకోవాలనే కుట్ర కూడా బాబు అండ్ కో మదిలో ఉందని తెలుస్తోంది. రాజ్యసభలో మెజార్టీ లేకపోవడంతో కేంద్రంలో బిజెపి ఆపసోపాలు పడుతోంది. ఈ దశలో ప్రతి ఒక్క మెంబరూ ముఖ్యమే...అందుకే రాజ్యసభ సీటుకు అంత క్రేజ్ వస్తోంది.

In both telugu states notifications for Rajyasabha seats is released. So TDP is in doubt. There conform of three MP seats. But they are thinking about fourth candidate.