కమలం సిగలో గులాబీ ?

31 May 2016


కేంద్రం లో చేరేఇష్యూ లో టిఆర్‌ఎస్ చేరుతుందా, అవుననే సిగ్నల్స్ ఉన్నయి. ఎందుకంటే అమిత షా హైదరాబాద్ వచ్చిన టైం లో అప్లికేషను పెట్టుకుంటే పరీశీలిస్తామని అని అనడం లో అర్ధం అదే అంటున్నారు.  పార్టీ లో సర్వం తానే  అయి నడిపించే బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా అంత తేలికగా నోరు జారరు అంటున్న్నారు. అయితే అమిత్‌షా కామెంట్స్ పై టిఅర్ఎస్ ఇంకా స్పందించ కపోవడంతో కేంద్రమంత్రి వర్గంలో టిఆర్‌ఎస్ చేరుతుందా లేదా అనేది హాట్ టాపిక్‌గా మారింది. రాజకీయా ల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రువులు ఉండరన్న దాని ప్రకారం బిజెపి, టిఆర్‌ఎస్‌లు కలసి పని చేయవనే రూల్ ఎం లేదు ఎవరి అవసరాలు వారివి.

ఉత్తరాదిన ఉన్న మాక్సిమం ఎంపి  స్థానాలు గెల్చుకుని, రికార్డు సృష్టించిన బిజెపికి ఇక 2019 ఎన్నిక ల్లో ఇప్పుడున్న ఎంపి సీట్లలో తగ్గుదలే తప్ప పెరుగుదల ఉండదని తేలిపోవడంతో ఈశాన్య, దక్షిణాది రాష్ట్రాలపై ఇప్పటి నుంచే కమల దళాధిపతులు కన్నేశారు. ఎన్‌డిఎ కూటమిలోకి వీలైనన్ని పార్టీలను చేర్చుకుని కాంగ్రెస్‌కు చెక్ పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా  తిద్ ఫ్రంట్ ని  ప్రస్తావిస్తున్న ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, బెంగాల్ సిఎం మమతా బెనర్జీ కి నే చెక్ పెట్టే క్రమంలో కొత్త పార్టీలు ఎన్‌డిఎలో చేరాలంటూ ఆహ్వానాలు పంపుతు న్నారు.

దక్షిణాదిన బిజెపి బలపడే అవకాశాలు లేకపోవ డంతో ఆ ప్రాంత పార్టీలను ఆకర్శించేందుకు ప్రయత్ని స్తున్నారు. 2019 ఎన్నికలకు ఏడాది ముందే ఎన్‌డిఎ లోంచి బయటకు వచ్చేయాలని ఎపి సిఎం చంద్రబాబు భావిస్తున్నారని ముందుగానే పసి గట్టిన బిజెపి పెద్దలు, ఆ లోటును భర్తీ చేసుకోవడంతో పాటు తృతీయ కూటమికి దక్షిణాదిన అవకాశం లేకుం డా చేయాలన్న దిశగా పావులు కదుపుతున్నారు. ఈ ఫ్యూహంలో భాగంగానే టిఆర్‌ఎస్‌తో జత కట్టాలని భావిస్తున్నారు. అందులో భాగం గ జగన్ మోహన్ రెడ్డి ని కూడా మచ్చిక చేస్కునే ట్రైల్స్ మొదలెట్టారంటున్నారు .

TRS is trying to join in NDA. At the time of Amith Shah came to Hyderabad he told about it. BJP tying to join more parties in NDA and want check to Congress.