మాణిక్యంలాంటి మాట

2 May 2016


వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి మంత్రులను కలసే అర్హత లేదు, ఇదీ ఏపీ ఆర్ధికమంత్రి యనమల కామెంట్. ఇది నిజంగా దారుణం, ఎందుకంటే ఏ ప్రజాప్రతినిధికి అంతెందుకు సామాన్యుడికైనా, తమ ప్రభుత్వంలోని పెద్దలతో నిజంగా కలిసే అర్హత, అవకాశం, అవసరం ఉంటుంది. దానికి మినహాయింపులు లేవ్, అందుకే ఇలాంటి అడ్డదిడ్డమైన కామెంట్లను మిత్రపక్షాలే ఖండిస్తున్నాయ్. ఇవాళ రావులపాలెంలో మంత్రి మాణిక్యాలరావు కూడా జగన్ కి ఢిల్లీలో ఎవరినైనా కలిసే ఆర్హత ఉందని, యనమల అలా ఎందుకు కామెంట్ చేశారో అర్ధం  కాదన్నారు. 

ఇదే ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. ఐతే వాస్తవం మాట్లాడినందుకు ఆయన్ని అభినందించాల్సిందే కూడా! జగన్ కి అంత ఆర్హత లేకపోతే, రాజధాని శంకుస్థాపనకి రావాల్సిందిగా ఎందుకు జగన్ అప్పాయింట్ మెంట్ కోసం ప్రయత్నించారని ఎదురు ప్రశ్నించారు మాణిక్యాల రావ్. మాణిక్యాల రావ్ స్పందనతో కాస్త కలకలం రేగినా, అందులో వాస్తవం ఉంది కాబట్టే ఎవరూ స్పందిచలేదు. .పార్టీలోకి చేరికలపై ఏ కామెంట్ చేయకపోయినా, వాళ్లకి మాత్రం ఇష్టంలేదనే సౌండ్ మాత్రం విన్పిస్తోంది. ఆయన అడగని, జనం అడుగుతున్న మాట  ఏంటంటే జగన్ కి ఆ అర్హత లేనప్పుడు..వాళ్ల పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు మాత్రం ఎలా పునీతులవుతారని, జవాబుందా చంద్రబాబూ..!

YSRCP leader fighting against TDP CM and his corrupted nature. So all TDP and BJP leaders are commenting about this. AP Finance minister commented about it, Jagan have no rights to do like this.