స్వరాజ్య మైదానాన్ని విదేశీ పరం

30 May 2016


స్వరాజ్య మైదానాన్ని విజయవాడ స్క్వేర్‌ సిటీ నిర్మాణం పేరుతో ప్రభుత్వం విదేశీ కంపెనీకి కట్టబెట్టే నిర్ణయం వెనక్కు తీసుకోవాలని పలువురు వక్తలు ఉద్ఘాటించారు. స్వరాజ్య మైదానం పరిరక్షణే లక్ష్యంగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు, నగర ప్రముఖులతో రౌండ్‌ టేబుల్‌ సమావేశం ఆదివారం గాంధీనగర్‌లోని చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ హాల్లో నిర్వహించారు. టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో మాజీ మంత్రి వడ్దే శోభనాద్రీశ్వరరావు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అత్యంత విశిష్టత గల స్వరాజ్య మైదానాన్ని విదేశీ కంపెనీకి దారాదత్తం చేసే చర్యలు అప్రజాస్వామికమని పేర్కొన్నారు. చైనా బృందం ప్రతిపాదించిందే తడవుగా ప్రభుత్వం ఏకపక్షంగా అంగీకరించడం దారుణమన్నారు. సమాజానికి ఉపయోగపడుతున్న స్వరాజ్య మైదాన పరిరక్షణకు అందరూ కలిసి పార్టీలకు అతీతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. టాక్స్‌ పేయర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు టి.సాంబిరెడ్డి, ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు పాల్గొన్నారు.

Vijayawada PWD ground is a historical place, it has a big history. At the time of freedom fight so many meetings were conducted in this ground. Now Chandrababu Naidu government is trying to give this place to foreign countries.