తల్లి మరణమే మేలు చేసింది

7 May 2016సహారా గ్రూప్ అధినేత సుబ్రతోరాయ్‌కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సుబ్రతో రాయ్ తల్లి కాలధర్మ చెందడంతో రెండేళ్లుగా జైల్లో ఊచలు లెక్కపెట్టుకుంటున్న సుబ్రతో రాయ్ కొంతసమయం బైట గడిపేఅవకాశం దక్కింది...చివరికి ఆయనకి లాయర్లు..కోట్ల రూపాయల బెయిల్ బాండ్లు ఇవ్వలేని  రిలీఫ్ ఆయన మాతృమూర్తి చనిపోయి మరీ ఇచ్చిందని చెప్పుకోవాలి.
సుబ్రతో రాయ్ కి ఇప్పుడు అంత్యక్రియలకు హాజరయ్యేందుకు నాలుగు వారాల పేరోల్ మంజూరైంది.  పెరోల్ సమయంలో ఆయన మఫ్టీలో ఉన్న పోలీసుల రక్షణలో ఉంటారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు బెంచ్ చెప్పింది. సుబ్రతోరాయ్‌తో పాటు ఆయన అల్లుడు అశోక్ రాయ్ చౌదరికి కూడా అంతే సమయం పాటు పెరోల్ ఇచ్చారు. 
సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ , సహారా హౌసింగ్ ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే రెండు సంస్థల్లో పెట్టుబడి పెట్టినవారికి ఆ సొమ్ము వెనక్కి ఇవ్వాలన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేయకపోవడంతో గత రెండేళ్లుగా సుబ్రతరాయ్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు రకరకాల ఆఫర్లివ్వడం సుప్రీం కోర్టు తిరస్కరించడంతో జైల్లోనే మగ్గుతున్న సుబ్రతో రాయ్ చివరికి తన తల్లి మరణం పరిమిత స్వేఛ్చను ప్రసాదించింది

Sahara Group MD Subrata Rai is in Jail still last two years. But his mother was passed away. So he got relief in Supreme Court.