కళ్లు లేకపోతేనేం..కత్రీనా ఉంటే చాలు

13 May 2016లక్స్ సోప్ యాడ్ గురించి తెలీని వారుండరు. తరాలు మారినా, ఎప్పటికప్పుడు నూతన తారలతో తమ బ్రాండ్ కి అండార్సింగ్ చేస్తూ జనం మదిలో లక్స్ యాడ్ తన పాపులారిటీ పెంచుకుంటూ పోయింది. కైపు కన్నుల కత్రీనా కైఫ్ చేసిన యాడ్ చూస్తే, లక్స్ సోప్ గొప్పదనమా, లేక కత్రీనా వంటి నాజూకు దనమా అన్పించకమానదు. ఐతే అంత హిట్టైన ఆ యాడ్ వెనుక కథ తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు.

గ్లామర్ ప్రపంచంలో లక్స్ బ్రాండ్ కి ఉన్న పాపులారిటీ అందరికీ తెలిసిందే. సూతింగ్, స్మూతింగ్ రియల్ ఫ్రాగ్రెన్స్ కి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే యాడ్ అది, అందాల కత్రీనా కైఫ్ పెదవులపై అలవోకగా జారిపోయే చిరునవ్వే ఓ సుగంధంలా గాలిలా కలిసిందా అన్నట్లుగా అడ్వర్టైజ్ మెంట్ రూపొందింది. ఈ యాడ్ కే గోవాలో జరిగిన ఎబీ అవార్డ్స్ లో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. ఈ యాడ్ మేకింగ్ చూసినోళ్లెవరైనా, ఖచ్చితంగా ఇంప్రెస్ అవుతారు. అందులో డెఫినిట్ పార్ట్ ని ఫ్లాష్ లా కట్ చేసిన ఫోటోగ్రాఫర్ పనితనాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు. అతని పేరు భవేష్ పటేల్, ఐతే ఇతనికి చూపులేదనే సంగతి చాలామందికి తెలీదు. 

లక్స్ బ్రాండ్ పెర్  ఫ్యూమ్ ప్రొడక్ట్స్ కి ఫోటో షూట్ చేసిన భవేష్ తన అంధత్వాన్ని బియాండ్ సైట్ ఫౌండేషన్ ట్రైనింగ్ తో అధిగమించినట్లు చెప్తాడు. కమర్షియల్ యాడ్ మేకింగ్ లో విజువల్లీ ఇంపైర్డ్ ఫోటోగ్రాఫర్ పాల్గొనడం తనతోనే మొదలైందంటాడు. కత్రీనా కైఫ్ ఎలా ఉంటుందో తెలియకపోయినా, ఆమె చుట్టూ  అల్లుకున్న సుగంధమే షూట్ సూపర్ గా రావడానికి సాయపడిందంటాడు. ఫోటో షూట్ జరుగుతున్న సమయంలో స్పాట్ లో సౌండ్స్ పై దృష్టి నిలపాలి, అదే సమయంలో కత్రీనా మాటలు వినాలి ఈ రెండూ బ్యాలెన్స్ చేస్తూ కరెక్ట్ టైమ్ లో స్నాప్ కట్ చేయడం ఓ ఛాలెంజ్ అని భవేష్ పటేల్ చెప్తాడు. తనతోపాటు మరి కొంతమంది కూడా యాడ్ షూట్ చేసినా, ఫైనల్ కాపీలకు మాత్రం తనవే ఎంపికవడం ఆనందంగా  ఉందని భవేష్ చెప్పాడు. ఇంత చేసి భవేష్ ఏం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ కాదు, ముంబైలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా చేస్తూ 2010 లో తన ప్రొఫెషన్ మార్చుకున్నాడట. ఏదైతేనేం కత్తిలాంటి కత్రీనా కైఫ్ ఎలా ఉంటుందో చూడలేకపోయినా, ఆడియెన్స్ కి మాత్రం అద్దిరిపోయే రేంజ్ లో చూపించాడు.

Bollywood heroin Katrina Kaif is very popular with Lux soap advertisement. Behind this advertisement its a big story. The person who worked as a photographer Bhavesh Patel is a blind. Only by observing sound he did this advertisement.