పుల్లవిరుపు మాటలు

7 May 2016


ఎన్డీఏ నుంచి బైటికి రావడం టిడిపికి ఒక్క నిమిషం పనట, కానీ రారు. ఇది అందరికీ తెలిసిన సత్యమే. రెండేళ్లనుంచి పదవులు అనుభవిస్తూ, పైకి ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రంలోని సమస్యలు నిధులపై పోరాటం చేస్తున్నామని బిల్డప్ ఇవ్వడం వారికి అలవాటేనంటారు. అందుకే ఇప్పుడు పార్లమెంట్ సాక్షిగా అసలు ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వడం కుదరదు పొమ్మన్నా సిగ్గులేకుండా రావెల లాంటి వాళ్లు, ఏదో సహాయ శాఖామంత్రి చెప్పినంత మాత్రాన ఎలా నమ్ముతామంటూ ప్రకటనలు చేస్తున్నారు.

మరోవైపు జలీల్ ఖాన్ లాంటి జిలానీలను ఉసిగొలుపుతూ బిజెపిపై ఏదో అసంతృప్తి రాగం ఆలపిస్తున్నట్లు వ్యూహం రచించిన చంద్రబాబు ఆ నోటితోనే వాళ్లని ఘాుటుగా విమర్శించవద్దంటూ ఆర్డరేస్తారు. మంత్రి పత్తిపాటి ఓ అడుగు ముందుకేసి, మంత్రివర్గం నుంచి బైటికి రావడం ఓ నిమిషం పనంటారు. మరి ఆ నిమిషం ఎప్పుడు వస్తుంది, ఇంకో రెండున్నరేళ్లకా..? పైగా జగన్మోహన్ రెడ్డి అభివృధ్దిని అడ్డుకుంటున్నారంటారు. ఆయన ప్రభుత్వం చేసే అభివృధ్దిని ఎలా అడ్డుకుంటారు. ఎమ్మెల్యేలకు తలుపులు తెరిచేసి బలం పెంచుకుంటూ పోతోంది టిడిపి, మరి దాన్ని జగన్ పై ఎలా విమర్శలు చేస్తారో అర్ధం కాదు. ఈ లాజిక్ కనీసం జనానికి తెలియాలి కదా.

రాష్ట్ర అభివృధ్ది కోసమే కేంద్రమంత్రివర్గంలో కొనసాగుతున్నామంటున్న వాళ్లు, బైటికి వస్తే ఇప్పటిదాకా వచ్చిన నిధులు కూడా రావా..! మరి వెస్ట్ బెంగాల్, బిహార్, యూపీ, తమిళనాడు, ఇలా మిగిలిన రాష్ట్రాలకు ఎన్డీఏ ఎలా నిధులు ఇవ్వగలగుతుంది. ఈ లాజిక్ టిడిపికి అర్ధం కాదా..? అందుకే పైపైన పుల్ల విరుపు మాటలు మాట్లాడుతున్నారు లోలోపల అంతా గప్ చుప్ అంటున్నారు.

BJP government announced it is not possible to give special status to Andhra Pradesh. But still TDP ministers are covering, and cheating peoples. All AP people are asking why TDP is continuing in NDP cabinet.