జార్జియాలో శ్రీదేవి ఫ్యామిలీ టూర్

4 May 2016


ఒకప్పటి అతిలోకసుందరి శ్రీదేవి రీఎంట్రీ ఆపసోపాలు పడుతూనే, మరోవైపు ఫ్యామిలీ లైఫ్ మిస్సవడం లేదు. జార్జియాలో ఫ్యామిలీకి ఫ్యామిలీనే టూర్ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది. మామ్ అనే ఓ సంచలనకథాంశంలో నటిస్తున్నానంటూ ఊదరగొడుతున్న శ్రీదేవి, తన భర్త బోనీ, కూతుళ్లు ఖుషీ, జాహ్నవి తో అక్కడి ప్రదేశాలు చుట్టేస్తుంది. మామ్ సినిమాకి నిర్మాత కూడా బోనీకపూరే కావడంతో అటు షూటింగ్ తో పాటు, ఇటు పిక్నిక్ కూడా  ప్లాన్ చేసుకున్నారు ఈ ఫ్యామిలీ మెంబర్లు. 

కత్తిలాంటి ఇద్దరు కూతుళ్లతో గ్లామర్ మదర్ శ్రీదేవి జార్జియా వీధుల్లో చక్కర్లు కొట్టిన ఫోటోలు ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేయడం మాత్రం మర్చిపోవడంలేదు. జార్జియాకి ముందు ఢిల్లీలో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసిన మామ్, జార్జియాలో ఇంకో వారంలో రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని వస్తుందట. అప్పుడు ఇక్కడ మరో షెడ్యూల్ లో సినిమా అంతా పూర్తి చేయాలనే ప్లాన్ లో టీమ్ ఉందట. అలా మామ్ ద్వారా మరోసారి ఆడియెన్స్ ముందుకు శ్రీదేవి రాబోతోంది.

Sridevi is now doing another movie called Maam. In Maam movie she is doing lead role.  Bony Kapoor is the producer to this movie. This movie shooting is doing in Georgia. Now she is enjoying with family in Georgia.