జంప్ జిలానీలకు షాక్ త్వరలో..!

24 May 2016


పార్టీ ఫిరాయించిన  ఎమ్మెల్యేలకు వణుకు పుట్టే న్యూస్ ఒకటి చెప్తోంది వైఎస్సార్సీపీ, ఆ పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇవాళ  మాట్లాడుతూ ఉత్తరాఖండ్ లో జరిగిన గలీజు యవ్వారంలో ఎమ్మెల్యేలపై వేటేసినట్లే ఇక్కడ కూడా అదే తరహా తీర్పు వస్తుందని చెప్పారు. దీంతో మరోసారి జంప్ జిలానీల యవ్వారంపై చర్చ బయల్దేరింది. ఐతే నాలుగు టీవీ ఛానళ్లలో చర్చలు పెట్టుకుని రచ్చ చేస్తేనో, ఇంకో కోర్టు తీర్పు అలా ఉంది. ఇలా ఉంది అని తమ బాకా పత్రికల్లో రాయించుకుంటేనో తీర్పులు మారిపోవు. ఇది నైతికతా, కాదా అనేది అందరికీ తెలుసు.

ఇప్పుడు ప్రజాతీర్పు, సుప్రీంకోర్టు ఈ రెండే మిగిలి ఉన్నాయ్. ఈ రెండింటీలో ఏది సమంజసంగా ఆలోచించినా, జంప్ జిలానీలకు బతికున్నంతవరకూ గుర్తుండిపోయే దెబ్బ తగలకమానదు. అందుకే అటు రాజీనామా చేసి జనంలోకి వెళ్లినా, లేదు సుప్రీంకోర్టు అనర్హులుగా ప్రకటించినా తమ ఎమ్మెల్యే పదవులకు నీళ్లొదుల కోవాల్సిందే. రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నేపధ్యంలో మేకపాటి ఇలా బెదిరిస్తున్నాడని, పచ్చచానళ్లు రాసుకుంటే రాసుకోవచ్చు కానీ నిజం ఎక్కడికి పోతుంది. అందుకే జూన్ కల్లా వీళ్ల భాగోతం తెలిసిపోతుందని అర్ధమవుతోంది.

YSRCP MP Mekapati Rajamohan Reddy commented about YSRCP jumping MLAs. He told shocking news to jumped MLAs. Really it will happen like Utharakand.