రాజ్ తరుణ్ కి షాక్

4 May 2016


అప్పటికీ సన్నిహితులు చెప్తూనే ఉన్నారు. ఆంధ్రాపల్స్ రెండు మూడుసార్లు ఈ విషయం చెప్పింది కూడా..! ఇప్పుడదే నిజమైంది.. రాజ్ తరుణ్ ని మూడు బ్యానర్లు తమ సినిమాలనుంచి తొలగించాయట, మనోడు తానే డ్రాప్ అయ్యానని చెప్పుకోవచ్చు. ఐతే అసలు విషయమల్లా మనోడు అన్నింటిలో వేలు పెడుతున్నాడట, అంతటితో ఊరుకోకుండా కాలు, మొత్తం శరీరం కూడా దూర్చేసి డైరక్టర్ కి పెద్దగా పనేం లేకుండా లేకుండా చేస్తున్నాట్ట. ఇతగాడి నిర్వాకం గమనించిన నిర్మాతల్లో హీట్ పెరిగిపోయి, జుట్టు పీక్కుని బాధపడేకంటే అసలు ప్రాజెక్టులనుంచే తీసేస్తా పోలా  అనే నిర్ణయానికి వచ్చి బై చెప్పేశారట. శతమానం భవతి అనే సినిమా నుంచి దిల్ రాజు(వెంకట్రమణారెడ్డి) రాజ్ తరుణ్ ను తొలగించి, శర్వానంద్ ను పెట్టుకున్నారట. 

అలానే మధురశ్రీధర్ అనే దర్శకనిర్మాత  ఫ్యాషన్ డిజైనర్ తీస్తున్న సంగతి తెలిసిందే, ఇదే లేడీస్ టైలర్ కి సీక్వెల్ గా చెప్పారప్పట్లో. దాంట్లోనుంచి రాజ్ తరుణ్ ని తీసేసి కొత్త కుర్రాడి కోసం  అన్వేషణ మొదలుపెట్టారట. అలానే ఈడోరకం ఆడోరకం మూవీ నిర్మాతలు కూడా నాని అనే కొత్త కుర్రాడికి దర్శకుడిగా అవకాశం ఇస్తూ తీయాలనుకున్నారు. అందులో రాజ్ తరుణ్ ని ఫిక్స్ చేసుకుని కూడా వెనక్కి తగ్గారట, అలానే బూతు, ద్వంద్వార్ధాలతో సినిమా నింపేసే మారుతి కూడా ఇతగాడితో ఓ సినిమా ప్రారంభించాడు. ఐతే దర్శకత్వం మాత్రం వేరొకరికి అప్పగిద్దామని మారుతి ప్లాన్. ఈ విషయంలో రాజ్ తరుణ్ వెలెట్టి తనకి తెలిసిన డైరక్టర్ల పేర్లు సూచించడం మొదలెట్టాట్ట, అలా మన రాజ్ తరుణ్ సోంబేరితనానికి సరైన ప్రతిఫలం దక్కిందట.

Hero Raj Tarun started his carrier with Uyala Jampala movie. Later he getting hit movies. Now he engaged three movies. But talk is he is doing direction also, so he was suspended form that movies.