పొంగులేటికి షాక్

3 May 2016


పార్టీ ఫిరాయింపుదార్ల రాజ్యంలో ఇప్పుడు తొలి దెబ్బ తగిలే పరిస్థితి కన్పిస్తోంది. తెలంగాణలో వైఎస్సార్సీపీ లో ఎంపిగా గెలిచిన పొంగులేటికి ఆ పార్టీ ప్రసిడెంట్ గా ఊహించని అత్యున్నత పదవి దక్కింది. ఐతే జగన్ మెతక వైఖరి కారణంగానో, లేక అధికారపార్టీ అండ కావాలనో తపనో కానీ ముగ్గురు ఎమ్మెల్యేలలో ఇద్దరు జంపయ్యారు. ఇప్పుడు మిగిలున్న ఏకోనారాయణతో పాటు, ఎంపి శ్రీనివాసరెడ్డి కూడా టిఆర్ఎస్ లో జాయినవుతారంటూ ప్రచారం జరుగుతోంది. అసలు అలా కాదు పార్టీ కలిపేయండంటూ మంత్రి కేటీఆర్ బరితెగించి అడగడం మరీ దారుణం. దానికి పొంగులేటి ఆలోచించి చెప్తా అనడం రాబోయే పరిణామం ఏంటో పేపర్ లీక్ చేసేసింది.

ఇక్కడ విషయం ఏంటంటే, పొంగులేటిని పార్టీ ఎందుకు మారుతున్నారని కార్యకర్తలు నిలదీయడమే మారుతున్న పరిణామాలకు ఇది సంకేతం కావచ్చు. ఇప్పటిదాకా కార్యకర్తల మనోభీష్టానికి అనుగుణంగా పార్టీ మారుతున్నాం అని చెప్పినవాళ్లం చూసాం. కానీ ఇప్పుడు కార్యకర్తలు తిరగబడ్డారు, మరి నేతలు ఏం చేస్తారు. గతంలోనూ పార్టీ మారిన మదన్ లాల్ తాను వైసీపీలో ఉండగా దర్జాగా ఉండేవాడ్నని. బుద్ది లేదు కాబట్టే పార్టీ మారానంటూ ఓపెన్ గానే బాధపడ్డారు. ఇప్పుడదే పరిస్తితి పొంగులేటికి తప్పదా..?

In Telangana state YSRCP won three seats. Now two of party MLAs jumped into TRS. Now Poguleti is trying to jump into TRS. All party members are question why he is changing party.