షారుఖ్ కి అంత ఆస్థా

7 May 2016


బాలీవుడ్ బాద్షా, కింగ్ ఖాన్, షారుఖ్ ఇప్పుడు తన ఆస్తి ఎంతో బైటపెట్టాడు. అది చూసి జనం నోరెళ్లబెడుతున్నారు. దాదాపు 400 కోట్ల  రూపాయలు ఆయన ఆస్తిగా చెప్పడంతో అవాక్కవుతున్నారు. షారుఖ్ చేస్తే మహా అయితే ఓ యాభై సినిమాలు చేసుండొచ్చు, ఒక్కో సినిమాకి యాబై కోట్లు తీసుకున్నా 250 కోట్లు మించి ఉండకపోవచ్చు. ఐనా ఇంత ఆస్తిపాస్తులెలా కూడబెట్టాడన్నదే డౌట్.

పర్సనల్ డీటైల్స్ విషయానికి వస్తే షారూక్ 1965 వ సంవత్సరంలో ఢిల్లీలో పుట్టిన షారూక్ తల్లిదండ్రులు తాజ్ మహ్మద్ ఖాన్, లతీఫ్ ఫాతిమా. వారిద్దరూ ఇప్పుడు లేరు. ఖాన్ చదువు మొత్తం ఢిల్లీలో కొనసాగింది. 1991లో గౌరీని పెళ్లాడాడు, స్టడీస్ లో  కమ్యూనికేషన్, ఫిల్మ్ మేకింగ్‌లో మాస్టర్ డిగ్రీ షారుఖ్ ది. 

మొదటసారిగా 1989లో ఓ టివి కార్యక్రమంలో ద్వారా వెలుగులోకి వచ్చాడు. ఫౌజీ అనే టివి కార్యక్రమం ద్వారా తెరపై కనిపించాడు. అందులో పిచ్చ పాపులర్ అయిన షారుఖ్ 1992వ సంవత్సరంలో తొలి సినిమా దీవానాతో జనానికి తెగ నచ్చేశాడు. ఒక్కో సినిమాతో తన స్థాయిని పెంచుకుంటూ బాలీవుడ్‌లో బాద్‌షాగా ఎదిగాడు. షారూక్‌కు ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి షారుఖ్ ఆదాయం విలువ దాదాపు 600 మిలియన్ డాలర్లు (రూ.39,791,970,000) ఉంటుందని లెక్క కట్టారు.

Bollywood Badshah Sharuk Khan recently announced his property details. It is really shocking to experts. All most he did 50 movies. But his property details are 400 crores.