దావూద్ అనుచరుల వేట

23 May 2016


ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అంతర్జాతీయ నేరగాడు దావూద్ ఇబ్రహీం ను పట్టుకునేందుకు ఎన్ఐఏ ముందుకు కదిలింది. ఇందుకోసం ప్రపంచంలో దావూద్ గ్యాంగ్ ఎక్కడెక్కడ విస్తరించిందో తెలుసుకుని వాటి మూలాలు నిర్వీర్యం చేసే పనిలో పడింది. జాహిద్ మియాన్, దావూద్ గ్యాంగ్ లో మెంబర్ డీ గ్యాంగ్ లో దావూద్ తరపున సౌతాఫ్రికాలో పనులు చక్కపెడుతుంటాడు, అంతేకాదు ఇండియాలో బిజెపి, ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ నేతలను మట్టుబెట్టడానికి దావూద్ ఇతన్నే నియమించాడు. ఇలా ప్రపంచంలో దావూద్ ఇబ్రహీం అనుచరులు ఎక్కడెక్కడ ఉన్నారో, తేల్చే పనిలో పడింది జాతీయభద్రతా దళం. ఇందుకోసమే సౌతాఫ్రికా ప్రభుత్వానికి నేరగాళ్ల అప్పగింత ఒప్పందాన్ని గుర్తు చేసింది. 

జాహిద్ మియాన్ వివరాలను అందజేసి, అతగాడిని తమకి అప్పగించాల్సిందిగా కోరింది. పోర్ట్ రోడ్ లోని  ఏఎస్-23 కోర్ స్టెన్ ఏరియాలో జాహిద్ మియాన్ ఉంటున్నట్లుగా సమాచారం ఇచ్చింది ఎన్ఐఏ. జావేద్ చిక్నా తో కలిసి జాహిద్ మియాన్ 2002 లో జరిగిన గుజరాత్ అల్లర్లకు స్కెచ్ వేశాడని ఎన్ఐఏ చెప్తోంది. జాహిద్, చిక్నా ఇద్దరూ కలిసి ఇండియాలోని హిందూనేతలపై దాడికి వ్యూహాలు రచించారు. ఇందుకోసం స్థానిక యువకులను ప్రోత్సహించేవారు. సౌతాఫ్రికా నుంచే ఈ ప్లాన్లన్నీ అమలు చేస్తూ నిరుద్యోగులకు వల వేసేవాడట, నేరగాళ్ల అప్పగింత ఒప్పందం కింద వారిద్దరినీ తీసుకురావడానికి ఎన్ఐఏ సిబ్బంది సౌతాఫ్రికా పయనమవుతోంది. ఈ ఒక్కదేశంతో సరిపెట్టకుండా డీ గ్యాంగ్ ఎక్కడెక్కడ ఉందో తెలుసుకుని, వారిని బంధించే యత్నంలో ఉంది జాతీయభద్రతాదళం.

NIA team is searching for Davud Ibrahim gang. He is most wanted criminal of whole world. So India NIA team is going to South Africa.