బ్రహ్మోత్సవంపై అంత బ్యాడ్ టాకేంటి

23 May 2016


మహేష్ బాబు బ్రహ్మోత్సవం ఎదురు చూసినంతసేపు పట్టలేదు తుస్ మనడానికి. సినిమా అస్సలు చూడలేకపోతున్నామని, సీట్లలో కూర్చోవడమే కష్టంగా మారిందని కొంతమంది కామెంట్ చేసారు. మరి కొంతమంది వేరే పనేం లేనట్లుగా సోషల్ నెట్ వర్క్ సైట్లలో సైటేర్లు వేస్తూ టైమ్ పాస్ చేశారు. సినిమా కోసం ఎంత కష్టపడ్డారు, ఎంత బిజినెస్ చేసింది. అది కాస్త తేడా కొడితే ఏమవుతుందన్న ఆలోచనే లేకుండా సాగిపోతాయ్ వీళ్ల కామెంట్లు. టిక్కెట్ రేటు పెట్టి కొన్నాం కాబట్టి మా ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేస్తున్నామనవచ్చు కానీ ఆ సినిమా కొన్నవాళ్ల పరిస్థితేంటనేది ఆలోచించవద్దా. సరే ఈ హితోక్తులను పక్కనబెడితే బ్రహ్మోత్సవం ఈ రోజుకు కూడా ఫ్యాన్స్ కి పండగే ఐతే సినిమా సాగదీయడం   క్లారిటీ లేకుండా తీశాడని అంటున్నారు. 

అయితే శ్రీకాంత్ అడ్డాల మహేష్ కలిసి ఏదో కన్ఫ్యూజన్ లో తీయడానికి భారీ తారాగణమే కారణమయ్యుండాలి, లేదంటే నాలుగు గంటల సినిమాను ఎడిట్ చేసిన తర్వాత వచ్చిన ఫలితం అన్నా అయ్యుండాలి. సినిమాలో పాటలు హృద్యంగా ఆకట్టుకునేలా ఉన్నాయనడంలో సందేహం లేదు. మహేష్ బాబు ఇమేజ్ ఏంటో ఈ సినిమా ఓపెనింగ్స్ ప్రూవ్ చేశాయ్. ఎంత బాగోలేదనే టాక్ ఉన్నా కూడా, బ్రహ్మోత్సవం నిర్మాతలకు నష్టాలు రావనేది ఇప్పటికే డిసైడైందట. సినిమాలో బ్యాడ్ గా, డ్రాగింగ్ గా అన్పించిన సీన్స్ ఎడిట్ చేసి ఫ్రెష్ గా మళ్లీ మూవీని చూపించడానికి బ్రహ్మోత్సవం క్రూ సిధ్దమైందట. సో ఆ లెక్కన తిరిగి మళ్లీ ఓ కొత్త బ్రహ్మోత్సవం చూస్తామేమో..!

Mahesh Babu Bhramotsavam got very bad talk. But it give some satisfaction at box office. The movie story is very lengthy, and so many number of artiest. These are the reasons for Bhramotsavam flap.