ఔను నేను బూతే చూస్తా

6 May 2016


మాంసం తింటాం కదా అని మెడలో వేసుకోం, అలానే బూతు ఏదో దశలో అంతా చూసుంటారు కాబట్టి. అదే నాకిష్టం అదే చూస్తా అని ఎవ్వడూ చెప్పడు. ఒక్క రామ్ గోపాల్ వర్మ తప్ప, ఇంటర్నెట్ వాడకంపై తన ఒపీనియన్ చెప్తూ, అసలు తాను నెట్ వాడేదే పోర్న్ సినిమాలు, వీడియోలు చూసేందుకని చెప్పేశాడు వర్మ. మనోడికి కండలు పెంచడంతో పాటు, ఆడపిల్లల తొడలు వగైరా వగైరాపైనే ఇంట్రస్ట్ అని ఆయనకి ఆయనే చెప్పుకుంటాడు  ఆ పేరుతో పుస్తకాలు రాస్తాడు కూడా.

మరిప్పుడు ఇలా బూతు కంటెంట్ కోసమే ఇంటర్నెట్ చూస్తా అనడం బహుశా ఎదుటివాడు అడిగిన ప్రశ్నకి చిర్రెత్తుకొచ్చి ఇచ్చిన సమాధానం అయుంటుందని అనుకోవాలి. ఎందుకంటే ఇలా వర్మ రేంజ్ సెలబ్రెటీ ఎవరూ చెప్పరు. ఎందుకంటే వర్మ ట్వీట్లు, కామెంట్లు చూసినవాళ్లెవరైనా నెట్ లో ఆయన సెర్చింగ్ ఏ ఏ అంశాలు చేస్తుంటారో అర్ధం అవుతూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు కాంటెంపరరీ ఇష్యూస్ పైనే మనోడు స్పందిస్తాడు. పైగా ట్విట్టర్ అనేది ప్రవేట్ వ్యవహారం ఆయన్నిఫాలో అయినవాళ్లకే ఆయన ఏం కామెంట్ చేసినా చేరుతుంది కానీ, పబ్లిక్ కాదు. అందుకే నా నెట్ నా ఇష్టం అని వర్మ అనగలిగాడు.

Ramgopal Varma is again hot topic in news. His comments about internet giving shock to fans. He is telling, i use internet only to see p0rn sites videos.