మహేష్ కి పంచ్ పై పంచ్ ఇచ్చిన ఆర్జీవీ

24 May 2016


రామ్ గోపాల్ వర్మ పంచ్ లు, ట్విట్టర్లో పేలుతుంటాయ్. ఐతే అవి రిసీవ్ చేసుకునేవాళ్లు, లేదంటే బాధితుల ఫాలోయర్లు మాత్రం వాటిపై మండిపడుతుంటారు. కానీ ఫస్ట్ టైమ్ మహేష్ బాబుపై వేసిన సెటైర్లకి అంతా యునానిమస్ గా అంగీకరిస్తూ, రీట్వీట్లు చేయడం విశేషం. సూపర్ స్టార్ డమ్ ఉన్న హీరో ఇలాంటి సినిమా చేయడం తప్పనే ఇన్ డైరక్ట్ మీనింగ్ తో రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన ట్వీట్లుకు అందరూ పాజిటివ్ గానే స్పందించారు. ఇది ఓ రకంగా రామ్ మహేష్ ఫ్యాన్ లా ఇచ్చిన ట్వీట్లనే అందరూ భావించారు. దాంతోపాటుగా ఇండస్ట్రీలో  ఎవరు నంబర్ వన్ హీరోలో కూడా ఓ రకంగా ఆయన ట్వీట్లు చెప్పాయ్. 

శోభన్ బాబు ఫ్యామిలీ హీరోనే కానీ, నంబర్ వన్ సూపర్ స్టార్ కృష్ణ అని గుర్తు చేశాడాయన. ఫ్యామిలీ సినిమాలు చేయడం కంటే, బ్లాక్ బస్టర్లు ఇచ్చినప్పుడే ప్రొడ్యూసర్లు హ్యాపీగా ఉంటారని మహేష్ కి హితబోధ చేశాడు వర్మ. బహుశా సినిమా రిజల్ట్ తర్వాత  ప్రిన్స్ కూడా అదే ఫీలింగ్ లో ఉండుంటాడు. ఒక్కడు పోకిరీ సినిమాలకు ముందు ఇలాంటి ఫ్లాప్సే వస్తే, ఇకపై ప్రయోగాలు చేయను అని చెప్పిన మహేష్. సక్సెస్ ట్రాక్ లో అది మర్చిపోయుంటాడు. బ్రహ్మోత్సవం రిజల్ట్ తనకి మరోసారి సొంత అభిరుచి కాదు, కలెక్షన్లు రాబట్టడమే ముఖ్యమనే సూత్రం మరోసారి గుర్తు చేసిందంటున్నారు. రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు కూడా అవే చెప్పాయ్.

Once again Ramgopal Varma used twitter on Tollywood super star Mahesh Babu. But now he got support. He gave suggestion to Mahesh Babu about Bhramotsavam movie.