అబ్బబ్బ ఏం అందం

7 May 2016


అందమంటే ఆడదే అన్న ఫిలాసఫీ వర్మది. ఓపెన్ గా చెప్పేసే వర్మ మరోసారి తన కళాపోషణని బైటపెట్టాడు. ఎప్పుడో తన సినిమాతోనే తెరపైకి వచ్చిన రాధికా ఆప్టే పై మనసు పారేసుకున్నాడు. అస్సలు అందం అంటే ఇదీ, పిచ్చెక్కిపోతుంది  నాకు అన్న స్టైల్లో ఓ ట్వీట్ పారేశాడు. నా మూడు జన్మల్లో ఇలాంటి ఫిగర్ చూడలేదంటూ రాధికా ఆప్టే సెక్సీ ఫోటోని పోస్ట్ చేసి మరీ ట్వీట్ చేశాడు వర్మ. మరీయనకి మూడు జన్మలెత్తిన జ్ఞాపకం ఎలా ఉందో కానీ, అమ్మ బమ్మదేవుడో కొంపముంచినావురో పాటను కూడా రాధిక పై పాడేయడం విశేషం. ఇంత పిచ్చిగా హీరోయిన్లపై రామ్ గోపాల్ వర్మ కామెంట్లు చేయడం ఇదేం మొదటిసారి కాదు. 

నా ఇష్టం వచ్చినట్లు నేను కామెంట్ చేస్తా అని కూడా అనగల సమర్ధుడితడు. తొందర్లోనే రాధికా ఆప్టేతో మరోసారి తన సినిమా పిచ్చ తీర్చుకుంటాడేమో అని ఇప్పుడు టాక్ నడుస్తోంది. మరోవైపు ట్రంప్ కెన్నడీ, అబ్రహాం లింకన్ తర్వాత బెస్ట్ అమెరికా ప్రసిడెంట్ అవుతాడంటూ కూడా ట్వీట్ చేశాడు వర్మ. గెలిగి, తమాషా చూడటం వర్మ స్టైల్ మరి ఈ ట్వీట్లు చూస్తే కాదనగలరా..!

Ramgopal Varma is twitted about Radhika Apte and posted a hot pic of Radhika Apte. He is saying i have never seen such type of figure.