రజనీకాంత్ కి వీరప్పన్ కి లింకేంటి

18 May 2016


రజనీకాంత్ ను వీరప్పన్ కిడ్నాప్ చేయబోయాడట, ఇది రామ్ గోపాల్ వర్మ చెప్తున్నమాట. ఇప్పటికే కిల్లింగ్ వీరప్పన్ పేరుతో ఓ సినిమా విడుదల చేసిన వర్మ. వీరప్పన్ పేరుతో మరో సినిమా చేశాడు. ఇది మే 27న రిలీజ్ అవుతోంది. దీన్ని ప్రొడ్యూస్ చేసింది సచిన్ జోషి, మౌనమేలనోయి, ఒరేయ్ పండు లాంటి సినిమాలు తెలుగులో తీసి ప్రస్తుతం బాలీవుడ్ లో నటిస్తున్న కుర్రోడే ఇతను. బండ్లగణేష్ కి వార్నింగిచ్చి కాస్త కలకలం రేపిన సచిన్ ఇప్పుడు నటనపై కంటే నిర్మాతగానే కాన్సన్ ట్రేట్ చేస్తుండగా, రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం వీరప్పన్ ను ప్రమోట్ చేస్తున్నాడు. 

ఇందులో ఓ సందర్భంలో వీరప్పన్ రాజ్ కుమార్ ని కిడ్నాప్ చేసినట్లే, రజనీకాంత్ ను కూడా కిడ్నాప్ చేయాలని ఫీలయ్యాడట. రాజ్ కుమార్ ను కిడ్నాప్ చేసిన సమయంలో ఎలాంటి హంగామా జరిగిందో ఎవరూ మర్చిపోలేదు. ఐతే రజనీకాంత్ ను ఎందుకు కిడ్నాప్ చేయాలనుకున్నాడో, తెలియకపోయినా ఒకప్పుడు సూపర్ స్టార్ కూడా వీరప్పన్ అంటే భయపడేవాడని చెప్పేవాళ్లు. వీరప్పన్ డెత్ తో చాలామంది ఊపిరి పీల్చుకున్నారని అప్పట్లోనే అనేవాళ్లు.

Controversy director Ramgopal Varma is now doing a movie with Veerapan Story in Sachin Joshi Production. In this movie Veerapan was tried to kidnap Rajanikantha.