ఉపాధి హామీ నిదులను దుర్వినియేగం చేస్తున తెలుగుదేశం కార్యకర్తలు..

20 May 2016


కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న ఉపాధి హామీ నిదులను తెలుగుదేశం కార్యకర్తలకు పంచుతున్నారని మాజీ మంత్రి ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లాలోనే 200 కోట్ల రూపాయల విలువైన నీరు-చెట్టు పనులు చేపట్టి తెలుగుదేశం కార్యకర్తలకు అప్పగించారని ఆయన ఆరోపించారు. ఈ నిదుల దుర్వినియోగంపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, కేంద్ర ప్రభుత్వాలకు పిర్యాదు చేస్తామని రామచంద్రారెడ్డి చెప్పారు.వైఎస్ ఆర్ కాంగ్రెస్ నుంచి టిడిపిలో చేరిన ఎమ్మెల్యేలు ప్రస్తుతం అవమానాలకు గురి అవుతున్నారని ఆయన అన్నారు.వారు నైతికంగా విలువలు పాటించాలంటే పదవులకు రాజీనామా చేసి తిరిగి గెలవాలని ఆయన అన్నారు. లేదా తిరిగి వైఎస్ ఆర్ కాంగ్రెస్ లోకి రావాలని ఆయన అన్నారు.

YSRCP MLA Ramchandra Reddy fired on TDP government and its ruling. TDP leaders misusing MGNREGS funds.