సిగ్గులేనమ్మ

27 May 2016


సిగ్గు లేకుండా మాటలు మార్చడంలో పొలిటికల్ లీడర్లని మించినవాళ్లు లేరు. టిడిపి, కాంగ్రెస్, బిజెపి ఇదీ పురంధ్రీశ్వరి పొలిటికల్ ప్రస్థానం ప్రస్తుతానికి ఈ నేత ఏపీకి హోదా గురించి మాట్లాడే అర్హత ఉందో లేదో తెలీదు కానీ, కేంద్రం మాత్రం ఇచ్చేది కాదని, అసలు ఇవ్వాల్సిన అవసరమే లేదని అంటోంది. ఇది ఆమె సామాజికవర్గానికి చెందినవాళ్లలో టిడిపిలో ఉన్నవాళ్లు ఆమెపై కామెంట్లు చేసుకోవడానికి బాగా ఉపయోగపడే మాట ఒకటి వాడిందామె. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదట. ఇది చాలు బిజెపిని ఆ వంకన ఈమెని టిడిపిలో ఓవర్గం ఆటాడుకోవడానికి, అదే మిగిలినవాళ్లు చేస్తే పెద్దగా పట్టించుకోరు కానీ తమకి ఆపోజిట్ గ్రూప్ కావడంతో కామెంట్లు చేయవచ్చు. అలానే హోదా కోసం తెగ బాధపడుతున్నట్లు బిల్డప్ ఇవ్వొచ్చు. సరే ఆ సంగతి పక్కనబెడితే, ఓ తెలుగునేత అయి ఉండి, రాష్ట్రానికి అసలు హోదా ఇవ్వనే ఇవ్వం అని అదేదో వాళ్ల అబ్బ సొత్తన్నట్లు మాట్లాడటంపై కడుపుమండని తెలుగు బిడ్డ ఉంటాడా..?

పైగా పురంధ్రీశ్వరి చేతుల్లోనే అంతా ఉన్నట్లు, ప్రత్యేక హోదాకి సమానమైన నిధులు ఇస్తారట. అంటే కనీసం 6లక్షల కోట్లు ఇవ్వాలి, నిజమేనా నిజంగా మీకా సత్తా ఉందా ?అక్కడికేదో నిధుల వరద పారించినట్లు, వాటి గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేయడం లేదనడం సమంజసమేనా, ఇఁతా చేసి ఆమె ఎన్టీఆర్ కూతురు కావడంతో ఆ గౌరవంతోనే చాలామంది విమర్శించలేకపోతున్నారు. ఐనా కడుపుమండిన తెలుగు బిడ్డ తిరగబడిన నాడు  ఏమవుతుందో చూడాలని అనుకుంటే, పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయ్. 

BJP leader, ex central minister Purandeswari is famous for changing party. Now she is talking about AP special status.