పూజితకి ఏం కావాలి?

13 May 2016


వ్యాంప్ క్యారెక్టర్లు చేసి, తెరమరుగైన పూజిత ఇప్పుడు మళ్లీ హడావుడి చేస్తోంది. ఐతే మొగుడు తనని వదిలేసి మరో పెళ్లి చేసుకున్నాడంటూ వాపోవడంతో ఎవరూ ఏం స్పందించలేని స్థితి. ఎందుకంటే మొగుడూ పెళ్లాల మధ్యలో దూరితే ఏం జరుగుద్దో ఆల్రెడీ ఆమె నటించిన సినిమాల్లోనే చాలాసార్లు చూశాం కదా..! విజయగోపాల్ అనే పూజిత మొగుడు, పూజితకు విడాకులు ఇవ్వకుండా రేఖారాణిని పెళ్లి చేసుకున్నాడని ప్రాథమికంగా ఆమె కంప్లైంట్. ఐతే ఇప్పుడు పూజితకు ఏం కావాలి, అతని నుంచి విడాకులు తీసుకుని, రేఖతో కాపురం చేసుకుంటే సరిపోయేదని భావిస్తుందా, లేక తన పిల్లలకు డబ్బు, భరణం కావాలని కోరుకుంటుందా ఇదే తేలాలి.

ఐతే ఇప్పుడు పూజిత ఎస్ఆర్ నగర్ పిఎస్ లో విజయగోపాల్, ఆమె సవతి ఇద్దరూ తన ప్రాణాలు తీసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఆ ముప్పు ఉందని చెప్పడం మరో టర్న్ తీసుకుంటోంది. నిజంగా అలా జరుగుతుందా..? అదే నిజమైతే, మరిప్పుడు పూజిత కోరుకుంటున్న న్యాయం ఏంటి..ఏదెలా ఉన్నా పూజితలోని అందం తగ్గలేదని, సరిగ్గా వాడుకుంటే మరో వదినో, అక్కో క్యారెక్టర్ నటి దొరికిందని కొందరు సంబరపడక తప్పదు.

After long time Tollywood actress Pujitha is now hot tipic in Media. She approached polices, that her husband married another girl with taking divorce from her.