బ్రహ్మోత్సవం సినిమా పై సంచలన వ్యాఖ్యలు చేసిన పొట్లూరి….!

19 May 2016


రేపే విడుదల కాబోతున్న ‘బ్రహ్మోత్సవం’ సినిమాను ఈ సినిమా నిర్మాత పొట్లూరి వరప్రసాద్ ప్రమోట్ చేస్తూ ఈరోజు అనేక ప్రముఖ పత్రికలకు ఇంటర్వ్యూ ఇస్తూ ఆ సినిమా గురించి అనేక ఆసక్తికర విషయాలను షేర్ చేసాడు. భారీ తారాగణంతో తీసిన ఈ సినిమా వల్ల తనకు 116 పెళ్ళిళ్ళు చేసిన ఫీలింగ్ కలిగిందని ఈ సినిమా పై సంచలన వ్యాఖ్యలు చేసాడు. అంతేకాదు ఈసినిమా షూటింగ్ మొదటిరోజున యూనిట్లో 624 మందికి భోజనాలు పెట్టిన సంగతిని గుర్తుకు చేసుకుంటూ ఈసినిమాకు ఖర్చు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా కోట్ల రూపాయలలో ఖర్చు జరిగిందని ఈ సినిమా భారీ బడ్జెట్ విశేషాలను వివరించాడు. ఈసినిమాలోని పాటలకు కోట్ల రూపాయలలో ఖర్చు పెట్టిన విషయాన్ని తెలియచేస్తూ ఈ సినిమా ద్వారా తన పివిపి నిర్మాణ సంస్థకు ఒకనాటి విజయ, వాహినీ సంస్థల స్థాయిలో తనకు పేరు వస్తుందని ఆశ పడుతున్నాడు పొట్లూరి.

ఈ సినిమాలో ‘వచ్చింది కద అవకాశం..’ పాటకు కోట్లు ఖర్చు అయిన షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు పొట్లూరి. అయితే ఇప్పటిదాకా తాను నిర్మించిన ఏ సినిమాల షూటింగ్ లకు తాను వెళ్ళిన సందర్భాలు చాల అరుదు అని అంటూ కన్నుల పండువలా సాగిన ‘బ్రహ్మోత్సవం’ షూటింగుకి మాత్రం ప్రతి రోజూ వెళ్లానని పీవీపీ చాల ఆనందంగా చెప్పుకున్నాడు. ఇదే సందర్భంలో మరొక షాకింగ్ విషయాన్ని బయట పెట్టాడు పొట్లూరి.

ఈ సినిమాలో తండ్రి పాత్రకు ఎవరిని ఎంపిక చేయాలి అని చర్చలు జరిగినప్పుడు రజినీకాంత్ ను మహేష్ బాబు తండ్రిగా నటింప చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది అన్న విషయాన్ని బయట పెడుతూ మరో దశలో మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ పేరు కూడ ఆలోచనలలోకి వచ్చినా మహేష్ తండ్రి పాత్రకు అన్ని విధాల సత్య రాజ్ బాగుంటాడు అన్న ఉద్దేశ్యంతో ఈ పాత్రకు సత్యరాజ్ ను ఎంపిక చేసిన విషయాన్ని తెలియ చేసాడు పివిపి. తాను జీవితంలో ఎదగడానికి అమెరికాకు అదేవిధంగా ఆ భగవంతుడుకి నిరంతరం ఋణపడి ఉంటాను అని అంటూ ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన తాను ఒక ప్రముఖ నిర్మాతగా మారుతానని తాను కలలో కూడ అనుకోలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు పొట్లూరి..

Mahesh Babu movie Bhramotsavam will release in May 20. Present this team is busy in movie promotions. In this movie promotions producer PVP comment about this movie is very shocking. He said i feel very happy such marrying 116 marriages.