ఫుల్ జోష్

27 May 2016


పవన్ కల్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాపవడం ఎన్టీవీకి ఓ రకంగా మంచిదైందిలా కన్పిస్తుందట. అది ఫ్లాపవడంతోనే కల్యాణ్ వరసగా కసిగా సినిమాలు చేస్తున్నాడట. అంటే అది హిట్టైతే ఏదో సినిమాలు వద్దనుకుంటాడులా వాళ్ల ఫీలింగ్ లా ఉఁది. ఐతే ఈ సంగతి ఎలా ఉన్నా పవన్ కల్యాణ్ కూడా వరసగా సినిమాలు ఒప్పేసు కుంటున్నాడన్నది నిజం. ఎస్జే సూర్య తో ఓ సినిమా చేస్తుండగా, ఈలోపలే మరో రెండు సినిమాలు ఓకే చేసాడని టాక్. అందులో ఒకటి త్రివిక్రమ్, హరీష్ శంకర్ తో మరోటి అని అంటున్నారు. ఐతే ఇందులో త్రివిక్రమ్ చేసేది దాసరి నిర్మాతగా వచ్చే మూవీ అవ్వొచ్చంటున్నారు. ఇక హరీష్ శంకర్ ప్రాజెక్టుని ఎఎం రత్నం తీస్తాడట, ఎఎం రత్నం గతంలో ఖుషీ, బంగారం తీసారు పవన్ తో. ఇప్పుడు మళ్లీ అదే కాంబినేషన్ రిపీట్ అవడం వెనుక ఏ ప్లాన్లు వర్కౌట్ అయ్యాయో తెలీదు కానీ, చాలా రోజుల తర్వాత రత్నం తెలుగులో సినిమా తీయడమే విశేషం.

After Sardhaar Gabbar Singh disaster Pavan Kalyan  is doing continuous movies. Present he doing three movies. One movie with SJ Surya, Trivikram and Harish Shankar.