మహానాడులో అలా చేయగలరా

28 May 2016


క్లారిటీ వచ్చేసింది, ఎవరెటో తేలిపోయింది, ఇప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వం దమ్ము చూపించగలదా ఆంధ్ర రాష్ట్రానికి జరిగే అన్యాయాన్ని ఆపగలరా..కనీసం గొంతెత్తి చాటగలరా, తెలుగుదేశానికి మహానాడు ఓ పెద్ద సంబరంలా జరుపుకుంటారు. రకరకాల పిండివంటలతో పాటు, అనేక రాజకీయ తీర్మానాలు చేస్తారు. భారీగా తరలివచ్చే కార్యకర్తలు, వివిధస్థాయిల్లోని నేతలతో పచ్చ తోరణం అల్లుకున్న తిరుపతిలో ఇప్పుడు చంద్రబాబు అండ్ కో జనం మదిలో మెదులుతున్న ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. తమ సత్తా  చాటేలా కేంద్రానికి ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అనే నినాదం పెక్కుటిల్లేలా గర్జించాలి. ప్రభుత్వమంటే అనేక అడ్డంకులు ఫార్మాలిటీస్ ఉంటాయ్. వాటిని అడ్డుపెట్టుకుని తప్పించుకున్న నేతలు వేదికపై ఊకదంపుడు ప్రసంగాలు మాని ఆంధ్రప్రజల గుండె చప్పుడు విన్పించాలి.

ప్రత్యేక హోదా ఇవ్వాలనే ఏక వాక్య తీర్మానం చేయగలరా, ఇది ప్రతిపక్షాలతో పాటు, జనం అభిప్రాయం, పోలవరం, నిధులు, విశాఖ రైల్వేజోన్, కేంద్రవిభజన చట్టంలో ఉన్నవే మరి వాటిపై మహానాడు వేదికగా డిమాండ్ చేయగలరా, నియోజకవర్గ అభివృధ్ది కోసమే పార్టీ మారామని చెప్పిన ఎమ్మెల్యేలైనా మహానాడులో ఈ మేరకు కేంద్రంపై నిప్పులు చెరగగలరా..? అంత సత్తా ఉందా..? పోరాడితే పోయేదేం లేదు, ఇదే ప్రశ్న విపక్షనేతలు అడుగుతుంటే ఎదురుదాడి చేస్తున్నారు. మరి జనం అడుగుతున్నారు, మీ సమాధానం ఏంటి మరి..?

TDP is conducting Mahanadu is Tirupathi very grandly. With number of food items and promisses. They are not talking about AP special status.