లవ్లీ ప్రొడ్యూసర్

25 May 2016


నయనతార అందం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే, అలాంటి హీరోయిన్ నిర్మాతగా మారితే? ప్రేక్షకుల వరకూ ఏమోకానీ సెట్ లో మాత్రం భలే సరదాగా ఉండే ఛాన్సులే ఎక్కువ, ఎందుకంటే అటు సీన్స్, ఇటు ప్రొడక్షన్ యవ్వారాలు సెట్ చేస్తూ, ఓ హీరోయిన్ అందరితో కలివిడిగా తిరుగుతుంటే అప్పటిదాకా తమతో మాట్లాడే ఛాన్సు దొరుకుద్దో లేని యూనిట్ మెంబర్లు కూడా హ్యాపీగా ఫీలౌతారు. కానీ హీరోయిన్లకే లేని పోని హెడ్డేక్స్ వస్తాయ్. ప్రతీ వాడి ఇగోని శాటిస్పై చేయాలి. ఎవరికేం కావాలన్నా అమర్చుతుండాలి, తప్పనిసరిగా కేకలు వేస్తుండాలి. ఈ టెన్షన్ వారి అందంపైనో, నటనపైనో పడే ఛాన్సులున్నాయ్ అలాంటి ఓ పేద్ బాధ్యతని ఇప్పుడు హీరోయిన్లు పంచుకోబోతున్నారు. 

ఇందులో నయనతార తమిళ్ లో ముందుగా ఓ సినిమాలో భాగస్వామి కాబోతోందట. ఇప్పటికే తెలుగులో ఇలా చేసి చేతులు కాల్చుకున్న వాళ్లలో రోజా, ఛార్మి ఉన్నారు. ఐతే హిందీలో మాత్రం కథానాయికలు నిర్మాతలుగా కూడా సక్సెస్ అయ్యారు. తమిళ్ కి వచ్చి, ఫేడౌట్ అయిన తర్వాత నిర్మాతలైనోళ్లున్నారు. కానీ నయనతారలా ఫుల్ స్వింగ్ లో ఉండగా ప్రొడ్యూసర్లుగా మారినవాళ్లు లేరు. చూద్దాం నయన నిర్మాతగా సక్సెస్ కంటిన్యూ చేస్తుందో లేదో.

Nayanthara is ever green heroin. She can do family movies and romantic pictures. Now she is exhibiting another angle in her. She is becoming as producer.