నయనతారే నంబర్ 1

2 May 2016


ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు దాటుతున్నా ఆమె హవాకి తిరుగులేదు. మధ్యలో కొన్నాళ్లు పెళ్లి చేసుకుని రిటైర్ అవుతానని కూడా అన్నది, ఐనా నయనతార తిరిగి యూత్ ఫిల్మ్స్ చేస్తుంది, పెద్ద హీరోలతో చేస్తుంది. అటు తెలుగు, తమిళ్ రెండు భాషల్లో నంబర్ వన్ హీరోయిన్ అంటే నయనతారే అని ఒప్పుకోకతప్పదు. అనుష్క తెలుగులో తానే లీడ్ చేసే సినిమాల్లో మాత్రమే కన్పిస్తుండగా తమిళంలో గ్లామరస్ గా నటిస్తోంది. ఐతే తెలుగు తమిళం రెండు భాషల్లో ఏదైనా కొత్త తరహా పాత్ర అంటే అది ముందు నయనతార దగ్గరకే వస్తుందంటారు.

ఏజ్ తో సంబంధం లేకుండా మెరిసిపోయే నయనతార అంటే ముదురు హీరోల నుంచి కుర్ర హీరోలవరకూ అందరికీ క్రేజే. అటు  యూత్ లా కన్పిస్తుండటం, ఇటు పెద్ద హీరోల సరసన కూడా సెట్ అవడం ఆమె ప్లస్ పాయింట్. ఇప్పటికిప్పుడు ఇరుముగం, కాష్మోరా, తిరునాళ్ తో పాటు మరో సినిమా తమిళ్ లో చేస్తుంది. లారెన్స్ తో మరో సినిమా ఓకే అయ్యే ఛాన్స్ కన్పిస్తోందట. తెలుగులో వెంకటేష్ తో బాబు బంగారం చేస్తుంది, బాలకృష్ణ, చిరంజీవి కొత్త సినిమాల్లో ఆమెకే ఫస్ట్ ఫ్రిఫరెన్స్ అంటున్నారు, సో మరి నయనతార కాకపోతే నంబర్ వన్ ఎవరు..

In both Tollywood and Kollywood Nayanathara is number one heroin. She is doing with young heroes and big heroes. Now she is ding four movies in Kollywood, and first preference to her in Chiranjeevi and Balakrishna movies.