ప్రపంచయాత్రికుడా ఇది చూడు

7 May 2016


 ప్రధాని మోడీపై విపక్షాలు వాల్డ్ టూరిస్ట్ గా మారిపోయారంటూ విమర్శిస్తుంటాయ్. సూటు బూటు మోడీ అంటూ రాహుల్ గాంధీ కూడా అవకాశం దొరికినప్పుడల్లా ఎద్దేవా చేస్తారు. వాటి మాట ఎలా ఉన్నా, ప్రైమ్ మినిస్టర్ హోదాలో మోడీ చేస్తున్న, చేసిన విదేశీ పర్యటనల ఖర్చు భారీగానే ఉంది. లోకేష్ బట్రా అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం కింద ఆ  ఖర్చు వివరాలను తెలుసుకున్నారు. దాని ప్రకారం  ఎయిర్ ఇండియా 2015 వ సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకూ మొత్తం 117 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు వెల్లడించింది. అలానే 2014 వ సంవత్సరం మే 26 న ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి ఆ ఏడాది చివరి వరకూ ఏడు నెలల్లోనే 94 కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు తెలిపింది.

ఈ లెక్కలు చూస్తుంటే మోడీ ఏ ఏటికాఏడు తన టూర్ దూకుడు పెంచుతున్నారనే అనుకోవాలి. మొదటి సంవత్సరంలో అయిన ఖర్చుకంటే రెండో ఏడాది పర్యటనలకు అయిన ఖర్చు దాదాపు 25 శాతం ఎక్కువ. అలానే పగ్గాలు చేపట్టిన రోజు నుంచి 2015 డిసెంబర్ వరకూ మొత్తం 22 దేశాలు పర్యటించారు మోడీ. అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, ఐర్లాండ్, బ్రిటన్, పాకిస్తాన్, కొరియా, మంగోలియా, చైనా, గల్ఫ్ దేశాలు, ఆప్ఘనిస్తాన్, టర్కీ, భూటాన్, ఆస్ట్రేలియా, మయన్మార్, ఫిజీ, జపాన్, సియాచెల్లీ, బ్రెజిల్, మారుటీస్ దేశాలను తన పర్యటనలో భాగంగా చుట్టేశారు. ఇదిప్పుడే ఆగేది కూడా కాదు
విదేశీ పర్యటనలకు అయిన ఖర్చు 211కోట్లు. మరి అదే ఏపీలో హుదూద్ తుఫాన్ ధాటికి మనకి కేంద్రం ప్రకటించిన సాయమెంతో తెలుసా 375కోట్లు. అలానే మొదటి సంవత్సరం ఏపీకి వెనుకబడిన జిల్లాల డెవలప్ మెంట్ కోసం విడుదల చేసింది 350కోట్లు, ఇలా రాష్ట్రాలను ఆదుకుంటామని చెప్పి ఇచ్చిన ఖర్చుతో పోల్చినప్పుడు తన ఫారిన్ టూర్ల ఖర్చే ఎక్కువగా ఉండటం ప్రధాని ఎలా సమర్ధించుకుంటారో చూడాలి.

All opponent parties are saying Naredra Modi is world tourist. And it a really a big shocking news. Narendra Modi spent only for his tours 211 cores.