ఆ ముగ్గురు

18 May 2016


తొంభైఏళ్ళ ముఖ్యమంత్రి మనకి అవసరమా అని అస్సాం ఎన్నికల సభల్లో ప్రధాని నరేంద్రమోదీ లేవనెత్తిన ప్రశ్న బిజెకి అనుకూలిస్తుందో బెడిసికొడుతుందో తెలియదుకాని అక్కడ బిజెపిని తరుముతున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి తరుణ్ గోగాయ్ వయసు 82 ఏళ్ళన్న విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. మన పొరుగు రాష్ట్రాలైన కేరళలో 93 ఏళ్ళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానందన్, తమిళనాడులో 94 ఏళ్ళ మాజీ ముఖ్యమంత్రి  వారివారి రాజకీయ ప్రత్యర్ధులకు చెమటలు పట్టిస్తున్నారు. వీళ్లుగాని గెలిచి ముఖ్యమంత్రులుగా మారితే అదో రికార్డ్ అవడం ఖాయం. విఎస్ అచ్యుతానందన్, కరుణానిధి ఈ ఇద్దరూ ఇద్దరే. మాజీ ముఖ్యమంత్రులవడంతో పాటు, తమ పార్టీలకు మరోసారి పెద్ద దిక్కుగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో మారారు. ప్రస్తుతం 93 ఏళ్ల అచ్యుతానందన్ కు సుదీర్ఘ రాజకీయ అనుభవం వుంది. 1967లో తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన అచ్యునందన్ ఒకసారి ముఖ్యమంత్రిగానూ పనిచేశారు. 1996 ఎన్నికల్లో లెఫ్ట్ ఫ్రంట్ సిఎం అభ్యర్ధిగా రంగంలోకి దిగిన్నప్పటికీ, తమ కూటమికే మెజార్టీ దక్కిన్నప్పటికీ సొంత నియోజకవర్గంలో ఓడిపోవడంతో ముఖ్యమంత్రి పదవి మిస్ అయ్యారు.

ఆ తర్వాత 2006లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అచ్యుతానందన్ ఇప్పుడు మరోసారి బరిలో నిలిచారు. మండుటెండల్లో ప్రచారంలో పాల్గొన్న అచ్యుతానందన్ రోజుకి కనీసం అయిదారు సభల్లో ప్రసంగించారు. కేరళలోతమదే విజయ మంటున్నారాయన. తమిళనాడు రాజకీయాల్లో తలపండిన కరుణానిధి 20 ఏళ్ల చిన్న వయస్సులోనే సినిమా స్క్రిప్టు రైటర్ గా సంచలన విజయం సాధించిన కరుణానిధి రాజకీయాల్లోనూ గాఢమైన ముద్ర వేశారు. ఇప్పుడు కరుణానిధి వయస్సు 94 ఏళ్లు. 75 సినిమాలకు స్క్రీన్ ప్లే రాసిన కరుణానిధి అయిదుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 60 ఏళ్లకు మించిన రాజకీయ అనుభవం వున్నవాడు. తనకు మాదిరిగానే అయిదుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలితను ఓడించి, ఆరో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రికార్డును తన సొంతం చేసుకోవాలన్నది కరుణానిధి టార్గెట్. 2009 లో స్పైనల్ సర్జరీ చేయించుకున్న కరుణానిధి వీల్ చైర్ లోనే అన్ని వ్యవహారాలు చక్కబెడుతుంటారు. ఆహారపు అలవాట్లు, జీవనశైలితో పాటు నిరంతరం ఏదో వ్యాపకంలో మునుగడమే వీరి తరగని ఉత్సాహానికి మూలాలుగా చెప్తారు. కరుణానిధి యోగా ధ్యానం చేస్తారు. నాలుగున్నరకే నిద్ర లేవడం, గంట సేపు యోగా, ముప్పై నలభై నిమిషాలు వాకింగ్ అచ్యుతానందన్ కి అలవాటు. 

వీరిద్దరితోపాటు అస్సోంలో ముఖ్యమంత్రి పదవి అభ్యర్ధిగా ఉన్న ప్రస్తుత సిఎం తరుణ్ గొగోయ్ కూడా 90ఏళ్లకు దగ్గర పడుతోంది. ఈయన కూడా ఎక్కువ వయస్సున్న పొలిటీషియన్, రాజీవ్ గాంధీ హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన తరుణ్ గొగాయ్ అస్సాంలో వరుసగా మూడుసార్లు కాంగ్రెస్ ని గెలిపించి, హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. 2011 ఎన్నికలకు ఆరు నెలల ముందే తనకు హార్ట్ సర్జరీ అయిన్నప్పటికీ ప్రచారాన్ని సమర్ధవంతంగా నిర్వహించడం విశేషం. ఇప్పుడు ఈ ముగ్గురిలో ఇద్దరు మాజీ సిఎం లుకాగా, ప్రస్తుత సిఎం హోదాలో ఎన్నికల బరిలో ఉన్నది తరుణ్ మాత్రమే.

In Asam election campaign Narendra Modi comments are very hot topic in media. He told we dont want 90 years CM. But in Tamilnadu, Asam and Kerala there CMs created sensation in India.