జవాబేదీ లోకేష్

2 May 2016


రాష్ట్రంలో ప్రతిపక్షం అన్నది లేకుండా చేస్తానని చెప్పిన లోకేష్ జగన్ పై ఎలా విమర్శలు చేస్తారని వైసీపీ అంటోంది. అనైతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న లోకేష్..తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న జగన్ పై విమర్శలు గుప్పించడం తగదని ఆ పార్టీ నేత అంబటి రాంబాబు అన్నారు. దాంతో పాటు ఆయనో సవాల్ కూడా విసిరారు. అసలు చంద్రబాబు ఆస్తులపై చర్చకు రావాలని, లోకేష్ స్థాయికి జగన్ అవసరం లేదని, వైసీపీ కార్యకర్త చాలంటూ ఎద్దేవా చేశారు. పాయింట్ల పరంగా చూస్తే, ఓ  పార్టీ అధినేత ఢిల్లీకి వెళ్లి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై నిలదీయడం తప్పెలా అవుతుందో జనానికి అర్ధం కావడం లేదు. 

అంటే వీళ్ల ఉద్దేశం పార్టీలోంచి ఎమ్మెల్యేలను బెదిరించి లాక్కుంటున్నా చూస్తూ ఊరుకుంటే అది సమర్ధత అవుతుందేమో మరి. రాష్ట్రాన్ని దోచుకుంటున్న ఇద్దరుబాబులంటూ అంబటి అనడం లోకేశ్ కి రుచించదేమో కానీ. నిజానికి జగన్ పై విమర్శలు చేసే స్థాయి లోకేష్ కి ఉందో లేదో చూస్కోవాలంటున్నారు ఎందుకంటే జగన్ స్వయంగా ఓ పార్టీ అధినేత..తండ్రి చనిపోయిన తర్వాత సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు. కానీ లోకేష్ కి ఏ స్థాయీ లేదు, కేవలం సిఎం కొడుకన్న పేరుతోనే రాజకీయం చేస్తున్నాడాయన. అందుకే అంబటి సవాల్ లో అర్ధం ఉందనే జనం అంటున్నారు.

YSRCP leaders YS jagan went to Delhi to report to central against Chandrababu Naidu and his activities. For this Nara Lokesh commented on YS Jagan.