ఫేడౌట్ హీరోయిన్లతో నాగ్ కి ఏం పని?

25 May 2016


కొత్త పిట్టలను (హీరోయిన్లను సినిమా భాషలో ఇలానే పిలుచుకుంటారు మరి) పట్టడంలోనూ, వాళ్లని ఎంకరేజ్ చేయడంలోనూ అక్కినేని నాగార్జునకి తిరుగు లేదంటారు. అలానే బడ్డింగ్ స్టేజ్ లో ఉన్న హీరోయిన్లకూ బూస్టప్ ఇవ్వడంలో నాగ్ ఎప్పుడూ ముందుంటాడు కూడా, ఐతే ఇప్పుడు కొత్త సినిమా కోసం ఫేడౌట్ అయిపోయిన వాళ్లని ఎందుకు తీసుకున్నాడనేది బిగ్ క్వశ్చెన్ గా మారింది. విమలారామన్, ప్రగ్వా జైశ్వాల్ ఈ ఇద్దరూ రెగ్యులర్ గోయర్స్ కి కూడా పెద్దగా గుర్తులేరు. నమో వేంకటేశ పేరుతో వస్తున్న సినిమాలో ఈ ఇద్దరినీ నాగ్ రికమెండ్ చేసుకోవడం ఆశ్యర్యమే.

ఎందుకంటే వీరిద్దరినీ రాఘవేంద్రరావ్ ఎంపిక చేసుకున్నాడంటే వారేం అలాంటి భక్తిరస పాత్రలు చేసినోళ్లు కాదు, నిర్మాతకు ఉన్న రిలేషన్లతోనూ నాగ్ ఛాయిస్ తోనే వీళ్ల సెలక్షన్ జరిగుంటది. విమలారామన్ విషయానికి వస్తే, జగపతిబాబు సరసన హోమం, గాయం-2 లో సెక్సీగా నటించింది. క్లాసికల్ డ్యాన్సర్ అని చాలా తక్కువమందికి తెలుసు బహుశా ఆ ఏంగిల్ లో ఈ సెమీడివైన్ ఫిల్మ్ లో ఛాన్స్ వచ్చిందేమో. ప్రజ్ఞా జైశ్వాల్ కంచెలో క్యారెక్టర్ పరంగా ఆకట్టుకుందే కానీ, పెద్దగా ఎక్స్ ప్రెసివ్ కాదు. ఐనా వాళ్లతోనే సినిమాను మెప్పిస్తామనేది నాగ్ ఫీలింగ్ కాబోలు..

Tollywood actor and producer Nagarjuna is showing interest on selecting heroin. He selected heroin for Namo Venkatesha movie.