మత్తయ్య అరెస్ట్

28 May 2016


ఓటుకు నోటు కేసు సృష్టించిన కలకలం మామూలుది కాదు, తెలుగుజాతి దశ దిశని మార్చేసింది ఈ ఘటన హైదరాబాద్ లో పార్టీ ఓడిపోతున్నా, ఎమ్మెల్యేలు వీడిపోతున్నా చంద్రబాబు నోరెత్తకుండా సైలెంట్ గా కూర్చోవడానికి, తెలంగాణలో తనకి తిరుగులేదనే రేంజ్ లో కేసీఆర్ రెచ్చిపోవడానికి నాందీ ప్రస్తావన ఇదే. ఏపీకి హోదాపై ప్రశ్నించే దమ్ము లేకపోవడానికి కూడా ఇదే కారణమంటారు. వాటిలో వాస్తవాలు ఎలా ఉన్నా, అదేదో సామెత చెప్పినట్లు అందరూ పోయారు. ఒక్క రేవంత్ రెడ్డి జైల్లో పెట్టి తన పంతం నెగ్గించుకున్న కేసీఆర్, తర్వాత ఇక అతని ఊసునిపట్టించుకోవడం మానేశారు. రేవంత్ కాదు రవ్వంత చేసానంటూ అప్పర్ హ్యాండ్ తీసుకున్నారు. 

ఇక ఆటలో అరటి పండులా మిగిలిన సండ్ర వెంకటవీరయ్య, మత్తయ్యలదే కామెడీ. అందరూ జంపవగా మిగిలిన ఎమ్మెల్యే సండ్రవీరయ్య, వెళ్దామా, వెళ్లినా పెద్దగా పట్టించుకోరు వెళ్లకపోతే బుక్కవుతానేమో అనుకుంటూ తీర్ధయాత్రులు చేస్తున్నాడు. మిగిలిన మత్తయ్యని పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు, ఎప్పుడో ఉద్యోగాలిప్పిస్తానని చెప్పి, జనానికి టోపీ పెట్టిన కేసులో ఇలాంటోడని తెలిసి కూడా టిడిపివాళ్లు చేరదీశారంటేనే పార్టీ స్తితేంటో తెలుస్తుంది. కేసు లో రేవంత్ రెడ్డి బొక్కలో పడ్డ తర్వాత, తనని పార్టీవాళ్లు పట్టించుకోవడం మానేశారని వాపోయాడు కూడా, ఇక ఇప్పుడు చీటింగ్ కేసులో అరెస్ట్ కావడంతో, ఇక ఓటుకు నోటు కేసులో వాస్తవాలు శాశ్వతంగా మూసుకుపోయినట్లేనంటున్నారు.

Vote for note is sensational case all over India. It leads all problems in telugu states. In this case Revanth Reddy is already arrested. Today Muthayya was arrested.