మాల్యాకి మన్మోహన్ గ్యారంటీనా..?

23 May 2016


విజయ్ మాల్యాకి అప్పులిచ్చిన బ్యాంకులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించాయో మరోసారి బైటపడింది. ఊరూ పేరు లేని ఓ అనామకుడు బ్యాంక్ గ్యారంటీ ఇచ్చాడని అతగాడి ఎక్కౌంట్ ను ఫ్రీజ్ చేశారిప్పుడు. దీంతో ఇప్పుడు ఆ పేద రైతు లబోదిబోమంటున్నాడు. సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయల మేర అప్పులు ఎగ్గొట్టి బ్రిటన్‌లో హాయిగా తలదాచుకున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు గ్యారంటీగా ఎవరున్నారో తెలుసా. మన్మోహన్ సింగనే ఓ పేద రైతట, ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్‌కు చెందిన ఓ చిన్నకారు రైతు విజయ్ మాల్యా తీసుకున్న అప్పుల్లో ఒకదానికి ఈ రైతు గ్యారంటర్ గా ఉన్నాడంటూ అతని ఖాతాను స్తంభింపజేశారు. ఎక్కడో మారుమూల తనంటే తన వ్యవసాయమేదో చూసుకునే మన్మోహన్ ఈ పరిణామంతో బిత్తరపోయాడు.

మాల్యా అప్పు తిరిగి చెల్లించేవరకు ఖాతా, దాని వల్ల వచ్చే ప్రయోజనాలు లేవ్. మన్మోహన్ సింగ్‌కు ఎనిమిది ఎకరాల భూమి ఉంది. అతడికి బ్యాంక్ ఆఫ్ బరోడాలో రెండు ఖాతాలున్నాయి, ఆ రెండింటినీ ఫ్రీజ్ చేయాలని ముంబై హెడ్ ఆఫీసు నుంచి స్థానిక బ్రాంచికి ఆదేశాలు వచ్చాయి. విజయ్ మాల్యా మొహం కూడా తెలీదంటున్న మన్మోహన్ సింగ్, బ్యాంకు ఆఫీసర్లను తిట్టిపోస్తున్నాడు. వాళ్ల నిర్లక్ష్యం వలన తన గ్యాస్ సబ్సిడీతో పాటు, వ్యవసాయఉత్పత్తుల కు కేంద్రం ఇచ్చే కనీస మద్దతు ధర కూడా అందుకోలేకపోతున్నాట్ట. మన్మోహన్ సింగ్, విజయ్ మాల్యాకి లోన్లు ఇచ్చేటప్పుడు బ్యాంక్ సిబ్బంది ఎవరిదో ఒకరిని గ్యారంటర్ గా చేర్చాలి కాబట్టి ఇలాంటి అవకతవకకు పాల్పడ్డారని ఈ ఉదంతం ఖచ్చితంగా బైటపెట్టింది. లేదా అప్పటి మన్మోహన్ సింగే నిజంగా గ్యారంటీర్ గా ఉన్నాడేమో చూడాలి.

Indian liquor king Vijay Malya is again crated sensation in Media. Vijay Malya while taking loan form Bank Of Baroda he put a farmer called Manmohan Singh. This is the best example how bank are supporting to Vijay Malya.