ఒంటరిగా నే దీదీ

20 May 2016


పశ్చిమ బంగాలో దీదీ దూకుడును ఎవరూ అడ్డుకోలేకపోయారు. ఎవరెన్ని అరోపణలు చేసినా.. మమతకే పట్టం కట్టారు.. బెంగాళీలు. తృణమూల్‌ హవాతో.. వామపక్ష కూటమి మళ్లీ ప్రతిపక్షానికే పరిమితమైంది. ఎగ్జిట్‌  పోల్స్‌  అంచనాలకు తగ్గట్టుగానే.. 2016 ఎన్నికల్లో టీఎంసీ హవా కొనసాగింది. ఇక లెఫ్ట్‌తో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌.. మరో ఘోర పరాభవాన్ని మూట గట్టుకుంది. 34 యేళ్ల కమ్యూనిస్టు కోటను బద్దలు కొట్టి చరిత్ర సృష్టించిన దీదీ, బెంగాళ్‌లో తనకిక అడ్డే లేదంటూ, ముందుకు సాగుతూనే వెళ్తున్నారు. ఐదేళ్లుగా తమ మమతను చూరగొన్న బెనర్జీకి.. మరోసారి అవకాశం ఇచ్చారు.. ఆ రాష్ట్ర ప్రజలు. ప్రజల ముఖ్యమంత్రిగా పేరుగాంచిన దీదీకే.. మళ్టీ పట్టం కట్టారు.

ఎప్పుడూ సాదాసీదాగా కనిపించే మమతనే అక్కున చేర్చుకన్నారు.. బెంగాళీలు. నీతి నిజాయితీకి పేరుగాంచిన దీదీ.. మచ్చలేని రాజకీయనేతగా ఎదిగారు. ఐదేళ్ల ఆమె పాలనకు ముగ్దులైన బెంగాళీలు.. గతం కంటే ఈ సారి ఎక్కువ స్థానాల్లో.. ఆమె పార్టీ తృణమూల్‌ను గెలిపించుకున్నారు. 2011 లో లాగే.. ఈ సారి కూడా వామపక్షాలకు చుక్కలు చూపించింది.. దీదీ. ఓ వైపు కాంగ్రెస్‌తో జట్టుకట్టిన వామపక్షాలు, మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు దీదీని అడ్డుకోవాలని ఎంతగా ప్రయత్నించినా.. అవన్నీ వ్యర్థమయ్యాయి. ప్రతిపక్షాల ఆరోపణలేవీ.. ఆమె విజయాన్ని ఆపలేకపోయాయి. ఎన్నికల బరిలో ఒంటరిగానే దిగిన దీదీ.. తిరుగులేని విజయాన్ని నమోదు చేసుకుంది. గత ఐదేళ్లలో శారదా చిట్స్‌  స్కాం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినా.. మాల్దా హింస ఘటనలు కుదిపేసినా.. ఆమె గెలుపును మాత్రం అడ్డుకోలేకపోయాయి. ముఖ్యంగా రాష్ట్రంలో దీదీకి వ్యతిరేకంగా వామపక్ష కూటమే విపరీతమైన ప్రచారం నిర్వహించింది. ఆమె ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూ.. ప్రజల్లోకి వెళ్లింది. అయినా వామపక్ష రాష్ట్రంగా పేరుగాంచిన బెంగాల్‌ లో.. ఆ పార్టీకి మరోసారి చేదు అనుభవమే మిగిలింది. ప్రతిపక్ష హోదాకే పరిమితమైంది.

అయితే ఎన్నికల సమయంలో.. మమత సర్కారుపై బీజేపీ నుంచి పెద్దగా వ్యతిరేక ప్రచారం జరగలేదని చెప్పొచ్చు. కేంద్రం నుంచి కూడా వ్యతిరేకత లేకపోవడం కూడా ఆమెకు కలిసొచ్చిన అంశమని భావిస్తున్నారు. ఇక ప్రధాని మోడీ కూడా బెంగాల్‌లో చాలా తక్కువ సభల్లోనే ప్రసంగించారు. ఆమెపై వచ్చిన ఆరోపణలు గుర్తు చేస్తూ.. ప్రచారాన్ని నిర్వహించారు. ఇక ప్రముఖలను బరిలోకి దించిన బీజేపీకి చేదు అనుభవమే మిగిలింది. నేతాజీ సుభాష్‌  చంద్రబోస్‌  మనువడు చంద్రకుమార్‌  బోస్‌, టీవీ నటి రూపా గంగూలీ వంటి వారు కూడా ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయారు.

వాయిస్ : ఈ గెలుపు.. బెంగాళీలదని.. మమతా బెనర్జీ అన్నారు. పార్టీకి అఖండ విజయాన్ని అందించిన ఓటర్లకు రుణపడి ఉంటానని స్పష్టం చేసింది. గెలిచిన సంబరం ఏ మాత్రం కనిపించకుండా ఉన్న మమతా.. మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రతిపక్ష పార్టీలు అసత్య ప్రచారాలు చేశారని.. దిగజారి వ్యవహరించారని.. చెప్పారు.
మరోవైపు ఈ నెల 27 ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని మమతా బెనర్జీ తెలిపారు.

Indian dynamic lady Mamatha Mamata Banerjee again showed her power. Again she formed government in West Bengal.