మహేష్ లుక్ వెనుక ఉందెవరు..?

18 May 2016


బ్రహ్మోత్సవం టీజర్లు, ట్రైలర్లో మహేష్ బాబు సందడి చేస్తున్నాడు. వాటితో పాటే అతని యూత్ లుక్ కూడా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ  అయింది. మహేష్ ఇందులో సూపర్ గా కన్పిస్తున్నాడంటూ ఆడియెన్స్ కూడా మెస్మరైజ్ అవుతున్నారు. అక్షయ్ త్యాగి అనే స్టైలిస్ట్ ప్రిన్స్ కాస్ట్యూమ్స్ డిజైన్ చేశాడట, దానికి ముందు అసలు ఓ టిపికల్ విజయవాడ యూత్ ఎలా ఉంటారు, వాళ్ల వేషధారణ పై దర్శకుడు శ్రీకాంత్ అడ్డాలతో పాటు అక్షయ్ త్యాగితో మహేష్ బాబు డిస్కస్ చేసారట.

సింప్లిసిటీ, ఎట్రాక్టివ్ కలర్స్ ఈ రెండే బేసిక్ పాయింట్లుగా ఈజీ గోయింగ్ పర్సన్ గా కన్పించేలా బ్రహ్మోత్సవంలో మహేష్ బాబు క్యాస్టూమ్స్ తయారయ్యాయ్. అద్భుతమైన స్కిన్ టెక్చర్ ఉండే  మహేష్ బాబుకి బ్రైట్ కలర్లు వండర్ ఫుల్ గా సెట్ అవుతాయని అక్షయ్ త్యాగి చెప్పుకొచ్చాడు. ప్రతి సీన్ లో మహేష్  క్యాస్టూమ్స్  లో సింపుల్, అండ్ స్టాండౌట్ కలర్ నే వాడిన డైరక్టర్ సినిమా మొత్తంమీద వంద డ్రస్సులు మార్చాడట. దీంతో మహేష్ బాబు ఈ సినిమాలో ఎంత సింపులో అంత గ్రాండ్ గా కన్పిస్తాడని అర్ధమవుతోంది. ఇప్పటిదాకా ఏ సినిమాలో కన్పించని రేంజ్ లో వంద డ్రస్సులు మార్చడం ఓ విశేషమే మరి.

Mahesh Babu movie Bhramotsavam is going to release on May 26. Already it teaser and posters released, in this posters Mahesh Babu is looking very handsome and young age. For this movie Akshay Tyagi is desiginer for Mahesh Babu.