నో డౌట్ మహేషే నంబర్ వన్

4 May 2016


టైమ్స్ డైలీ చేసిన ఆన్ లైన్ సర్వేలో తెలుగు హీరో మహేష్ బాబు సత్తా చాటాడు, ఓవరాల్ గా సిక్త్ ప్లేస్ లో నిలిచి తన పాపులారిటీకి ఎదురులేదని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. మరోవైపు ఆలిండియా రేంజ్ లో నంబర్ వన్ గా నిలిచాడు. రణవీర్ సింగ్ దీంతో ఈ ఇద్దరే మోస్ట్ వాంటెడ్ హీరోస్ గా అగ్రస్థానంలో నిలుచున్నట్లైంది. దేశవ్యాప్తంగా టైమ్స్ మేగజైన్ చేసిన టాప్ ఫిఫ్టీ డిజైరబుల్ మెన్ జాబితాలో రణవీర్ సింగ్ నంబర్ వన్‌ గా నిలవగా, తెలుగు నుంచి మహేష్ బాబు ఆరో స్థానం నిలుపుకున్నాడు. ప్రిన్స్ గత ఏడాది కూడా ఇదే స్థానంలో నిలవడం విశేషం. మొత్తం యాభైమందితో రూపొందించిన ఈ జాబితాలో మహేష్ ఒక్కడే టాప్ టెన్ లో ఉన్న తెలుగు హీరో. 

రణవీర్ సింగ్ నంబర్ వన్ ప్లేస్ లో నిలవడం ఎవరికీ పెద్ద ఆశ్చర్యం కలిగించని డెవలప్ మెంట్ గా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే బెస్ట్ యాక్టర్ గా అవార్డు దక్కించు కోవడంతోపాటు. వరస హిట్లతో తన పాపులారిటీ పెంచుకుంటూ పోతున్నాడు. తన లవర్ దీపికా పదుకునే తో పాటు ఫంక్షన్లలో డ్యాన్సులు గట్రా ఫుల్ ఎనర్జీతో చేస్తూ ఇరగదీస్తుంటాడు. టీమిండియా సూపర్ హీరో విరాట్ కోహ్లీ సెకండ్ ర్యాంక్ తో తన ఫామ్ దేశవ్యాప్తంగా చాటాడు. క్రికెట్ సిరీస్ లో తన సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తున్న విరాట్, అనుష్కతో ప్యాచ్ అప్ చేస్కుంటున్నాడని టాక్. యూత్ గాళ్స్ లో మనోడి క్రేజ్ అంతా ఇంతా కాదు.

ఖుబ్ సూరత్ మూవీ తర్వాత కపూర్ అండ్  సన్స్ తో ఫ్రేమ్ లోకి వచ్చాడు. ఫవాద్ ఖాన్. ఛాలెంజింగ్ రోల్ తో ఫవాద్ ఖాన్ తన ప్లేస్ కన్పామ్ చేసుకోవడమే కాకుండా టైమ్స్ డిజైరబుల్ మెన్ లిస్ట్ లో థర్ట్ ప్లేస్ దక్కించుకున్నాడు. నాలుగో స్థానంలో ఎక్స్ పీరియెన్స్ డ్ హీరో హృతిక్ రోషన్ నిలబడ్డాడు. ఇతగాడికి హిట్లు కాదు కదా, సినిమాలేం రిలీజవలేదు లాస్టియర్ ఐనా ఐకానిక్ మూమెంట్స్ చేయగలిగే హృతిక్ తన పాపులారిటీ ఏ మాత్రం తగ్గకుండా చూసుకున్నట్లున్నాడు. ఏజ్ తో పాటు తన హాట్ నెస్ అలానే కంటిన్యూ చేస్తున్నాడీ క్రిష్. కపూర్ అండ్ సన్స్ తో ఎంట్రీ ఇచ్చిన సిధ్దార్ధ మల్హోత్రాకే ఆన్ లైన్ లో ఆడియెన్స్ ఐదో ప్లేస్ కట్టబెట్టారు.. వచ్చీ రావడంతోనే మనోడి సెక్సీ ఆలియాభట్ తో రొమాన్స్ కూడా చేస్తున్నాడని టాక్..ఒక్క సినిమాతోనే అందరి దృష్టీ ఆకర్షించడమే మనోడి ప్లస్ పాయింట్

ఇక సిక్త్స్ ప్లేస్ లోనే మన మహేష్ బాబు కన్సిస్టెంట్ గా తన స్థానం పదిలం చేసుకున్నాడు..లాస్టియర్ కూడా మహేష్ ది ఇదే స్థానం కావడం గమనార్హం..అంతకుముందు అంటే 2013లో మహేష్ మోస్ట్ డిజైరబుల్ మేన్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచాడు కూడా..మహేష్ తర్వాత దగ్గుబాటి రానా..ప్రభాస్ కూడా జాబితాలో చోటు దక్కించుకున్నారు కానీ...రానాది పదకొండో స్థానం..బాహుబలిది 13వ  ప్లేస్..ఇక మిగిలిన ఏ తెలుగుహీరో టాప్ ఫిప్టీలో చోటు లేదు..ఒక్క రామ్ చరణ్ ది తప్ప..రామ్ చరణ్ ది పాపులారిటీలో 38వ స్థానం..అలా ప్రిన్స్ మహేష్ తెలుగు ఇండస్ట్రీలో నంబర్ వన్ పాపులారిటీ ఉన్న కథానాయకుడిగా నిలిచారనుకోవచ్చు..

Tollywood hero Mahesh Babu got top ten place in India. Recently Time Paper released most popular persons in India. In this place Mahesh Got Sixth place.