బ్రహ్మోత్సవంలో డ్యూయల్ రోలా..?

3 May 2016టీజర్లు, మోషన్ పోస్టర్లతో రోజుకో రకంగా ఫ్యాన్స్ కి పండగ చేస్తున్న ప్రిన్స్ మహేష్ బ్రహ్మోత్సవంలో డ్యూయల్ రోల్ చేస్తున్నాడా..? ఫ్యాన్స్ లో ఇదే న్యూస్ సర్కిలవుతోందిప్పుడు. ఎందుకంటే ఫస్ట్ టీజర్ విడుదలైనప్పుడు అందులో ఫుల్ క్రీమ్ కలర్ సూట్ లో మోస్ట్ ఎట్రాక్టివ్ గా కన్పించిన ప్రిన్స్ మహేష్ వేరు, అందులో ఫ్యామిలిలో యువరాజులా కన్పించి అందరి మనసులు ఆకట్టుకున్నాడు. కానీ ఇప్పుడు మోషన్ పోస్టర్లలో కన్పిస్తున్న మహేష్ వేరు టీ షర్ట్ తో ఫిట్ నెస్ కి కేరాఫ్ అడ్రస్ గా కన్పించాడు. యూత్ ఫుల్ గా కాలేజ్ గోయింగ్ గై లా అన్పించాడు, దాంతర్వాత మళ్లీ కోలాటం ఆడే గెటప్ రిలీజైంది. 

ఇదైతే ఓ రకంగా మురారి సమయంలో మహేష్ ని గుర్తుచేసింది, అంటే పద్నాలుగేళ్లు వెనక్కి తీసుకెళ్లాడు. అటు సినిమా బ్యాక్ డ్రాప్ చూస్తే ఓసారి వారణాసి కూడా వెళ్లొచ్చారు. అంటే ఇది చాలా పెద్ద స్పాన్ ఉన్న మూవీలా కన్పిస్తోంది. అందుకే ప్రిన్స్ మహేష్ డ్యూయర్ రోల్ లా, ఓ క్యారెక్టర్ ఆల్రెడీ రిచ్ ఫ్యామిలీలో ఉంటే మరో గై ఇంకోచోట ఉండటం. ఈ రెండు క్యారెక్టర్లు కలవడం ఇలా చాలా చాలా ఊహించుకుంటున్నారు ఫ్యాన్స్. ఊహలే కదా అంతెక్కడ ఉంటుంది. ఐతే సినిమా మాత్రం ఫ్యాన్స్ తో పాటు అందరినీ శాటిస్ ఫై చేస్తుందని శ్రీకాంత్ చెప్తున్నాడు. చూద్దాం  సినిమా చూడబోతూ స్టోరీలు అడగడమెందుకు.

Mahesh Babu is creating sensation with teasers and motion pictures. Recetly he released Bhramotsavam motion picture. But now it is talk in industry is in Bhramotsavam movie Mahesh Babu is doing dual role.