ప్రిన్స్ @25 ఎవరితో..

7 May 2016


సూపర్ స్టార్ మహేష్ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే 21 సినిమాలు చేసిన ప్రిన్స్, వరసగా ఆ నాలుగు సినిమాలు పూర్తి చేసి సిల్వర్ జూబ్లీ సినిమాకు దగ్గరవుదామనే ప్లాన్ లో ఉన్నాట్ట. ఈ ఏడాది జులై 31కి ఇండస్ట్రీకి వచ్చి మహేష్ బాబుకి 18 ఏళ్లు నిండుతాయ్. అసలు మహేష్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఇంత లాంగ్ రన్ ఉండనే ఉండదని ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. అంతకు ముందు తరం హీరోలపై గౌరవం కొద్దీ అలా చెప్పినా, మహేష్, పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా 30 ఏళ్లపాటు ఇండస్ట్రీలో హీరోలుగానే కొనసాగుతారు. అది వాళ్ల వారసత్వం, బ్యాక్ గ్రౌండ్ బలం.

బ్రహ్మోత్సవం తర్వాత మురుగుదాస్ మూవీ ఒకటి రెడీగా ఉందంటున్నారు. ఇక ఆ తర్వాత చేస్తే పూరీ జగన్నాధ్ కానీ, క్రిష్ తో కానీ, త్రివిక్రమ్ తో కానీ ఉండే అవకాశాలే ఎక్కువగా కన్పిస్తున్నాయ్. ఆ మూవీలు కన్ఫామ్ అయితే కెరీర్ లాండ్ మార్క్ గా ట్వెంటీ ఫిప్త్ మూవీని అనౌన్స్ చేయొచ్చు. గతంలోలా 50వ సినిమా, వందో సినిమా అని చెప్పడానికి ఈ యూత్ హీరోలకు కనీసం 30 ఏళ్లు పడుతుంది. అదే కృష్ణ కెరీర్ బిగిన్ చేసిన తొమ్మిదేళ్లోనే సెంచరీ కొట్టేశాడు. చిరంజీవి టెన్ ఇయర్స్ లో వందో మార్క్ అందుకున్నాడు. ఆ తర్వాత ఇక పెద్ద హీరోల్లో వంద సినిమా మార్క్ బాలకృష్ణకి మాత్రమే దక్కింది. అందుకే ఇప్పుడు ఇంకా మూడు సినిమాలున్నా, సిల్వర్ జూబ్లీ మూవీ ఏదౌతుందనే టాపిక్ మంచి అంచనాలను నెలకొనేలా చేస్తోంది.

Recently Times Magazine announced Top 10 list of Indian Celebrities. In this list Mahesh got top sixth place. Now Mahesh Babu is preparing for his 25th movie. Bhramotsavam is the his 21st film. But now he is preparing for 25th film.